Prabhas | ప్రభాస్ జోకర్ గెటప్ ఆలోచన మారుతిదీ కాదా.. ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Prabhas |డైరెక్టర్ మారుతీ తాజాగా తన కుమార్తె హియా దాసరి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన సినిమాల వెనుక జరిగే క్రియేటివ్ ప్రాసెస్‌లో హియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వెల్లడించారు. చిన్న వయసులోనే సినిమాలపై మంచి అవగాహన, ఆలోచనా శక్తి ఉన్న అమ్మాయిగా హియాను మారుతీ అభివర్ణించారు. మారుతీ మాట్లాడుతూ, “హియాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా, ఆమె అడ్వాన్స్‌గా ఆలోచించి తన అభిప్రాయాలను చెబుతుంది.
Prabhas |డైరెక్టర్ మారుతీ తాజాగా తన కుమార్తె హియా దాసరి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన సినిమాల వెనుక జరిగే క్రియేటివ్ ప్రాసెస్‌లో హియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వెల్లడించారు. చిన్న వయసులోనే సినిమాలపై మంచి అవగాహన, ఆలోచనా శక్తి ఉన్న అమ్మాయిగా హియాను మారుతీ అభివర్ణించారు. మారుతీ మాట్లాడుతూ, “హియాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా, ఆమె అడ్వాన్స్‌గా ఆలోచించి తన అభిప్రాయాలను చెబుతుంది. అందుకే నా ప్రతి సినిమా షూటింగ్‌కు ఆమెను వెంట తీసుకెళ్తుంటాను” అని తెలిపారు. షూటింగ్ లొకేషన్లలో కేవలం చూసే ప్రేక్షకురాలిగా కాకుండా, ప్రతి విభాగంలోనూ సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు.
ఇదే సందర్భంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన జోకర్ గెటప్ ఆలోచన హియా దాసరిదేనని మారుతీ వెల్లడించారు. ఆ ఐడియాపై ప్రభాస్‌తో స్వయంగా కూర్చుని హియా చర్చించిందని, ఆ కాన్సెప్ట్‌కి హీరో కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడని తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు “డైరెక్టర్ కూతురు అంటే ఇలా ఉండాలి” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
హియాకు చిన్నప్పటి నుంచే ఆర్ట్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉందని మారుతీ గుర్తుచేశారు. బొమ్మలు వేయడంలో ఆమెకు ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, ముఖ్యంగా జోకర్ థీమ్‌తో పెయింటింగ్స్ గీయడం ఆమెకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ ఆసక్తితోనే ఆమె ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించిందని తెలిపారు. పెయింటింగ్‌తో పాటు ఫోటోగ్రఫీపై కూడా హియాకు మంచి పట్టు ఉందని మారుతీ పేర్కొన్నారు.
ఈ క్రియేటివ్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగానే ‘ది రాజాసాబ్’ లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో హియా అభిప్రాయాలు ఉపయోగపడుతున్నాయని దర్శకుడు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో తదుపరి తరం కూడా సినిమా రంగంలో బలమైన మూలంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు మారుతీ పరోక్షంగా చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ చిత్రం జనవరి 9న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ సాధిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మారుతీ–ప్రభాస్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram