Director Maruthi | నిధి అగర్వాల్ నడుముపై చేయి వేసిన రాజా సాబ్ డైరెక్టర్.. ఇబ్బందిగా ఫీలై ఏం చేసిందంటే..!
Director Maruthi | రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం వచ్చే నెల 9న సంక్రాంతి కానుకగా అన్ని భాషల్లో భారీగా విడుదల కానుంది. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన ఈ గ్యాప్‌తో ప్రభాస్ అభిమానులు కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Director Maruthi | రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం వచ్చే నెల 9న సంక్రాంతి కానుకగా అన్ని భాషల్లో భారీగా విడుదల కానుంది. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన ఈ గ్యాప్‌తో ప్రభాస్ అభిమానులు కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన సినిమా ఏది విడుదల కాకపోవడంతో కొంత నిరాశ నెలకొంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాజా సాబ్’ను ఇప్పుడు భారీగా ప్రమోట్ చేయాలని చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, మొదటి సింగిల్ విడుదలైనప్పటికీ పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు రెండో పాట ఈ నెల 13న రానుండటంతో అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
మారుతీ–నిధి అగర్వాల్ వీడియో వైరల్
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కంటే దర్శకుడు మారుతీకి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హంగామా సృష్టిస్తోంది. బాలీవుడ్ లో జరిగిన ఒక ఈవెంట్ కు మారుతీ, హీరోయిన్ నిధి అగర్వాల్ కలిసి హాజరయ్యారు. అక్కడ నిధి ఫోటోలకు పోజులిస్తుండగా, మారుతీ అక్కడికి రాగానే ఆమె ఆయనను కూడా ఫోటోలకు ఆహ్వానించింది.అయితే ఫోటోలకు పోజులిచ్చే సమయంలో మారుతీ చెయ్యి నిధి నడుము వైపు వెళ్లినట్టుగా కనిపించడంతో ఆమె సున్నితంగా అతని చేతిని పక్కన పెట్టింది. ఈ క్షణం కెమెరాలో రికార్డ్ అవ్వడంతో క్లిప్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ఫ్యాన్స్ స్పందన – నెటిజెన్స్ విభిన్న అభిప్రాయాలు
ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు పంచుకుంటూ, మారుతీ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి వ్యక్తికి మన హీరో అవకాశం ఇచ్చాడు” అంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే మరో వర్గం నెటిజెన్స్ మారుతీని సమర్థిస్తూ, అతను కేవలం క్యాజువల్‌గా ఫోటోలకు పోజులిచ్చాడని, దానిలో ఎలాంటి దురుద్దేశం కనిపించదని అంటున్నారు. మరికొందరు మాత్రం “ఇది సరైన ప్రవర్తనా?” అంటూ విమర్శలు చేస్తున్నారు.
వాస్తవం ఏమిటి?
పూర్తి వీడియోను పరిశీలిస్తే ఇందులో దురుద్దేశం ఏమీ లేదని స్పష్టమవుతోంది. ముందుగా నిధి అగర్వాల్ స్నేహపూర్వకంగా మారుతీ భుజంపై చేయి వేసింది. తర్వాత ఫోటోలకు మామూలుగా నిలబడాలని భావించి ఆమె చేతిని తీసేసింది. సహజంగానే జరిగిన ఈ చర్యను సోషల్ మీడియాలో అతిశయోక్తిగా చూపించడం వల్లే ఈ వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది.
నిధి అగర్వాల్ స్పందన కోసం ఎదురుచూపులు
ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ‘ఆచార్య’ మూవీ ఈవెంట్‌లో చిరంజీవి–పూజా హెగ్డే సరదా సన్నివేశాన్ని కూడా తప్పుగా చూపిస్తూ అప్పట్లో నెగటివ్ ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పూజా హెగ్డే స్వయంగా స్పందించి ఆ వివాదానికి ముగింపు పలికింది. ఇప్పుడు ఈ వీడియోపై నిధి అగర్వాల్ ఏమైనా క్లారిటీ ఇస్తుందా? అన్నది చూడాలి. ఇకపోతే ‘రాజా సాబ్’ టీమ్ త్వరలోనే భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టనుండటంతో, సినిమా బజ్ ఎలా మారుతుందో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Worst behavior🤮 ilanti ep gallaki manodu chance lu ivvadam🤢 pic.twitter.com/8yx4XKv8nt
— Sunny Kesh (@sunnykeshII) December 10, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram