Drugs Case | డ్రగ్స్ కేసులో మలుపు.. శ్రద్ధా, నోరా, ఓరీకి క్లీన్ చీట్, ఆధారాలు ఏమి లేవని స్పష్టం చేసిన పోలీసులు

Drugs Case | గ్లామర్ ఇండస్ట్రీని కుదిపేసిన 2022 భారీ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాలీవుడ్ ప్రముఖులు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి, సోషల్ మీడియా సెలబ్రిటీ ఓరీ పేర్లు ఈ కేసులో వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ముంబై పోలీసులు వీరికి సంబంధించి ఎటువంటి పక్కా ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 26, 2026 8:10 AM IST
Drugs Case | డ్రగ్స్ కేసులో మలుపు.. శ్రద్ధా, నోరా, ఓరీకి క్లీన్ చీట్, ఆధారాలు ఏమి లేవని స్పష్టం చేసిన పోలీసులు

Drugs Case | గ్లామర్ ఇండస్ట్రీని కుదిపేసిన 2022 భారీ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాలీవుడ్ ప్రముఖులు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి, సోషల్ మీడియా సెలబ్రిటీ ఓరీ పేర్లు ఈ కేసులో వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ముంబై పోలీసులు వీరికి సంబంధించి ఎటువంటి పక్కా ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఈ ముగ్గురు స్టార్లను పలు మార్లు విచారించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వారు హాజరై సమాధానాలిచ్చారు. అప్పట్లో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ నెట్‌వర్క్‌తో వీరికి సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడటం కలకలం రేపింది.

ముగ్గురు పేర్ల‌ని తొల‌గించే నిర్ణ‌యం…

అయితే దర్యాప్తు కొనసాగిన కొద్దీ, ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. కేవలం నిందితుల వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే కేసును ముందుకు తీసుకెళ్లలేమని, స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా ఎవరినీ నిందితులుగా పేర్కొనలేమని స్పష్టం చేశారు. దీంతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ నుంచి ఈ ముగ్గురు పేర్లను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ముంబై యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్‌సీ) వివరాల ప్రకారం, అరెస్టయిన నిందితులు కొన్ని పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆ పార్టీలకు ఈ సెలబ్రిటీలకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే సాంకేతిక ఆధారాలు దొరకలేదు. కేవలం స్టేట్‌మెంట్‌ల ఆధారంగా కేసు నిలబడదని అధికారులు భావించారు.

ఎలాంటి చార్జ్ షీట్ న‌మోదు కాలేదు…

ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ సలీం డోలా అనుచరుడు మొహమ్మద్ సోహైల్ షేక్ వంటి వ్యక్తులపై దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్, ఓరీ పేర్లు విచారణలో ప్రస్తావనకు వచ్చినప్పటికీ, వారిని నిందితులుగా పరిగణించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై నోరా ఫతేహి పరోక్షంగా స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించగా, శ్రద్ధా కపూర్ టీమ్ కూడా అధికారికంగా ఎటువంటి ఛార్జ్‌షీట్ నమోదు కాలేదని వెల్లడించింది.

గతంలో గ్లామర్ ఇండస్ట్రీపై ఉన్న అనుమానాల నేపథ్యంలో ఈ కేసు పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. అయితే తాజా పరిణామాలతో “నిజం నిప్పులాంటిది” అన్నట్టుగా నిరాధార ఆరోపణల నుంచి ఈ ముగ్గురు బయటపడటం విశేషం. రెండేళ్లుగా వెంటాడుతున్న వివాదం నుంచి బయటపడటంతో వారి అభిమానులు ఊరట చెందుతున్నారు.