MSG | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. ఖుషీలో ఫ్యాన్స్

MSG |మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru) సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ చిత్రంగా తెరకెక్కగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.

  • By: sn |    movies |    Published on : Jan 10, 2026 8:13 AM IST
MSG | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. ఖుషీలో ఫ్యాన్స్

MSG |మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru) సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ చిత్రంగా తెరకెక్కగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, ప్రముఖ నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్స్ బ్యానర్లపై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మెగా అభిమానులతో పాటు సంక్రాంతి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని రూపొందింది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయనున్నారు. స్టార్ కాస్ట్‌తో పాటు టెక్నికల్ టీమ్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి నిర్వహించగా, ఎడిటింగ్‌ను తమ్మిరాజు అందించారు. సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఊరమాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని ప్రోమోలు స్పష్టం చేశాయి.

జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రాన్ని పరిశీలించింది. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సెన్సార్ ప్రక్రియ సాఫీగానే పూర్తైనట్లు చిత్ర బృందం తెలిపింది. కొన్ని చోట్ల డైలాగ్స్‌పై సెన్సార్ అధికారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయగా, వాటిని స్వల్పంగా సవరించాలని సూచించినట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్‌తో పాటు UA (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. దీని ప్రకారం 16 ఏళ్లు నిండిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూడవచ్చని, అంతకంటే తక్కువ వయసు వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

ఇక ఈ సినిమా రన్‌టైమ్ విషయానికి వస్తే, మొత్తం 2 గంటల 42 నిమిషాలు అంటే 162 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా వినోదానికి పెద్దపీట వేస్తూ కథ, కథనం రూపొందించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నయనతార, వెంకటేష్ లాంటి స్టార్ కాస్ట్ ఉండటంతో స్క్రీన్ స్పేస్ కూడా సమతుల్యంగా డిజైన్ చేసినట్లు సమాచారం. అనిల్ రావిపూడి తనకు కలిసి వచ్చిన సక్సెస్ ఫార్మూలానే ఈ సినిమాకు కూడా అనుసరించారని, ఫన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఊరమాస్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతోంది.