Niharika | శత్రువులు నా వెన‌కే ఉన్నారంటూ నిహారిక సంచ‌ల‌న కామెంట్స్.. రాకాస‌ ట్రైల‌ర్‌తో పెరిగిన అంచ‌నాలు

Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల‌ మరోసారి వార్తల్లో నిలిచారు. నటిగా, యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘రాకాసా’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • By: Sandeep |    movies |    Published on : Mar 26, 2026 4:42 PM IST
Niharika | శత్రువులు నా వెన‌కే ఉన్నారంటూ నిహారిక సంచ‌ల‌న కామెంట్స్.. రాకాస‌ ట్రైల‌ర్‌తో పెరిగిన అంచ‌నాలు

Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల‌ మరోసారి వార్తల్లో నిలిచారు. నటిగా, యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఇప్పుడు నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘రాకాసా’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగబాబు కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టిన నిహారిక, ముందుగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ముఖ్యంగా ‘ముద్దపప్పు అవకాయ’ వంటి ప్రాజెక్టులతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అనంతరం బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించిన ఆమె, ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా, ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.

రాకాసతో ప్రేక్ష‌కుల ముందుకు..

హీరోయిన్‌గా ఆశించిన స్థాయి గుర్తింపు రాకపోవడంతో, నిహారిక నిర్మాతగా మారారు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే బ్యానర్ స్థాపించి, వెబ్ సిరీస్‌లు, చిత్రాలు నిర్మిస్తూ కంటెంట్ ఆధారిత కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘డెడ్ లైన్’, ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి ప్రాజెక్టులతో నిర్మాతగా తనదైన ముద్ర వేశారు.

ప్రస్తుతం ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం రాకాస‌. ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్ హీరోగా నటిస్తుండగా, దర్శకుడు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స‌ర‌దా వ్యాఖ్య‌లు..

ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈవెంట్‌లో నిహారిక పాల్గొన్నారు. హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, కమెడియన్ గెటప్ శ్రీను తదితరులతో కలిసి ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ.. “ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ కథ. కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ కలగలిపి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది” అని తెలిపారు.

అయితే ఈ కార్యక్రమంలో నిహారిక చేసిన సరదా వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. “అరేయ్ నా ఏవి ఎవడ్రా చేశాడు..? ప్లీజ్ ఇలా చేయకండి, శ‌త్రువులు ఎక్క‌డో లేరు నా వెన‌కే ఉన్నారా” అంటూ నవ్వుతూ కామెంట్ చేయడంతో అక్కడున్న వారంతా హర్షధ్వానాలు చేశారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాకాస ట్రైలర్ తర్వాత మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతి  ఒక్కరు మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చివరగా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరిన నిహారిక, మూవీ యూనిట్‌కు కళాశాల యాజమాన్యం సన్మానం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ‘రాకాసా’పై అంచనాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు.