Virosh | టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారని వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు.
పెళ్లి తర్వాత ఈ జంట చేసిన కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పలు నగరాల్లో అభిమానులకు అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయడం ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు హనీమూన్‌కు వెళ్లే సమయంలో, వీరు మాత్రం సన్నిహిత మిత్రులతో కలిసి ‘బడ్డీ మూన్’ ట్రిప్‌కు వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షాకింగ్ పోస్ట్..
ఇదిలా ఉంటే, తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” అంటూ ఒక చిన్న యానిమేషన్ వీడియోను షేర్ చేసింది. అందులో విజయ్, రష్మికతో పాటు ఒక పొద్దుతిరుగుడు పువ్వు కనిపించడం, అలాగే రష్మిక టీషర్ట్‌పై గుడ్డు చిత్రం ఉండటం నెటిజన్లలో అనేక అనుమానాలకు దారి తీసింది.
ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “రష్మిక ప్రెగ్నెంట్ అయిందా?”, “గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు?” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. అయితే ఈ పోస్టు అసలు అర్థం ఏమిటో, నిజంగా ఏదైనా శుభవార్త ఉందో లేదో తెలియాలంటే రష్మిక స్వయంగా స్పందించాల్సి ఉంది.
సినిమాలతోను బిజీ..
ఇక కెరీర్ విషయానికి వస్తే, రష్మిక ఇటీవల ది గార్ల్ ఫ్రెండ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’, ‘రెయిన్‌బో’, ‘మైసా’, ‘కాక్‌టెయిల్ 2’ వంటి చిత్రాల్లో నటించనున్నట్లు సమాచారం. ఏదైతేనేం ఈ జంట వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా పోస్టులు రెండూ కలిపి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
