Sai Srinivas | గ్రాండ్‌గా నిశ్చితార్థం… సింపుల్‌గా పెళ్లి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం
Sai Srinivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే రోకా వేడుకతో తన కాబోయే సతీమణిని అభిమానులకు పరిచయం చేసిన శ్రీనివాస్, తాజాగా ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
Sai Srinivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే రోకా వేడుకతో తన కాబోయే సతీమణిని అభిమానులకు పరిచయం చేసిన శ్రీనివాస్, తాజాగా ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. “శ్రీనివాస కావ్యనం” అనే ప్రత్యేక పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో వధూవరులు మ్యాచింగ్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. కావ్య రెడ్డి చేతికి ఉంగరం తొడిగి, వివాహ ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు శ్రీనివాస్. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సినీ ప్రముఖులు హాజరు..
ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. బెల్లంకొండ కుటుంబం కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటోలు నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ, పెళ్లిని మాత్రం చాలా సాదాసీదాగా జరపాలని బెల్లంకొండ సాయి నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 29న పవిత్ర క్షేత్రం తిరుమల లో శ్రీవారి సన్నిధిలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. అనంతరం సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
కావ్య ఫ్యామిలీ కూడా పెద్దదే..
కాబోయే వధువు కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందినవారు.. ఆమె తాత రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి ప్రముఖ న్యాయవాది. ఆసక్తికర విషయం ఏమిటంటే, కావ్య చెల్లెలు మరియు శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదివినట్లు సమాచారం. ఆ పరిచయం ద్వారానే శ్రీనివాస్-కావ్య మధ్య స్నేహం ఏర్పడి, అది తర్వాత ప్రేమగా మారిందని చెబుతున్నారు.
ప్రఖ్యాత నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన సాయి శ్రీనివాస్, ‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించారు. మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్న ఆయన ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఈ వివాహ వేడుకపై కూడా ఆసక్తి నెలకొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram