Varanasi | లీకుల బారిన ‘వారణాసి’ షూటింగ్.. బోట్ యాక్షన్ సీన్ లీక్ అయిందంటూ ప్రచారం
Varanasi | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ భారీ చిత్రం మరోసారి లీకుల సమస్యను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Varanasi | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ భారీ చిత్రం మరోసారి లీకుల సమస్యను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన యాక్షన్ సీన్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని చెరువులో బోట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ వీడియోలు లీక్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇవి నిజంగా ‘వారణాసి’ షూటింగ్‌కు సంబంధించినవేనా అన్న విషయంపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.
జాగ్రత్తలు తీసుకున్నా కూడా..
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా మహేశ్ బాబు యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ కావడంతో చిత్ర బృందం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ లీకుల సమస్య మళ్లీ తలెత్తడం గమనార్హం.
సాధారణంగా రాజమౌళి సినిమాల షూటింగ్ అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సెట్లోకి ఎవరైనా వెళ్లాలంటే మొబైల్ ఫోన్లు బయటే వదిలి వెళ్లాల్సి ఉంటుంది. చిన్న ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌కు లీకులు తప్పకపోవడం నెట్టింట చర్చనీయాంశమైంది.
పూర్తిగా తగ్గని సమస్య..
ఇంతకుముందు టైటిల్ గ్లింప్స్ విడుదలకు ముందే మహేశ్ బాబు లుక్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఇదే సమస్యకు నిదర్శనం. డ్రోన్ల ద్వారా షూటింగ్ విజువల్స్ రికార్డ్ చేసి లీక్ చేస్తున్నారని అప్పట్లో రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదు.
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం ‘వారణాసి’ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అయింది. టైమ్ ట్రావెల్, ప్రపంచ అన్వేషణ ప్రధానాంశాలుగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. శివ భక్తుడిగా మహేశ్ బాబు ఒక సాహసయాత్రకు బయలుదేరి, విశ్వ రహస్యాలను చేధించే కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయాణంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న పాత్ర కీలకంగా ఉంటుందని టాక్.
హైదరాబాద్‌లో షూటింగ్..
మరోవైపు, షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రియాంక చోప్రా, మహేశ్ బాబుపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తన భాగం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం. మొత్తం మీద ‘వారణాసి’పై లీకుల వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram