Vishnu Priya | వివాదం తెచ్చిన హైప్… విష్ణుప్రియకు పెరిగిన సబ్‌స్క్రైబర్లు, ఆదాయంపై చర్చ

Vishnu Priya | డిజిటల్ మీడియా యుగంలో ఒక సంఘటన ఎప్పుడు వైరల్ అవుతుందో ముందుగా చెప్పడం కష్టం. కొన్ని సందర్భాల్లో విమర్శలు, వివాదాలే వ్యక్తిగత బ్రాండింగ్‌కు బలంగా మారుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ జరుగుతున్న చర్చ ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది.

Vishnu Priya | వివాదం తెచ్చిన హైప్… విష్ణుప్రియకు పెరిగిన సబ్‌స్క్రైబర్లు, ఆదాయంపై చర్చ

Vishnu Priya | డిజిటల్ మీడియా యుగంలో ఒక సంఘటన ఎప్పుడు వైరల్ అవుతుందో ముందుగా చెప్పడం కష్టం. కొన్ని సందర్భాల్లో విమర్శలు, వివాదాలే వ్యక్తిగత బ్రాండింగ్‌కు బలంగా మారుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ జరుగుతున్న చర్చ ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది.

ఇటీవల ఆమెపై నమోదైన కేసు ఒకవైపు వివాదానికి దారి తీస్తే, మరోవైపు ఆమె సోషల్ మీడియా ప్రెజెన్స్‌ ను గణనీయంగా పెంచిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అమలు చేస్తున్న సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పెరుగుతున్న స‌బ్‌స్క్రైబ‌ర్స్…

విష్ణుప్రియ ప్రత్యేక కంటెంట్ కోసం ఒక్కో యూజర్ నుంచి రూ.399 వసూలు చేస్తున్నారు. అయితే విజయవాడలో AISF నాయకులు అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఫిర్యాదు చేయకముందు వరకు ఆమెకు సుమారు 1,892 మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆమెకు నెలకు సుమారు రూ.7.5 లక్షల ఆదాయం వచ్చినట్లు అంచనా.

కేసు నమోదు తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. మీడియా, సోషల్ మీడియాలో ఈ అంశం విస్తృతంగా చర్చకు రావడంతో ఆమెపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగి 6 వేల మార్క్ దాటినట్లు తెలుస్తోంది. దీనితో ఆమె గ్రాస్ ఆదాయం నెలకు రూ.23 లక్షలకు పైగా చేరిందన్న ప్రచారం వినిపిస్తోంది.

దాదాపు రూ.13ల‌క్ష‌లు చేతికి..

అయితే ఈ మొత్తం ఆదాయం అంతా క్రియేటర్ చేతికి చేరదని నిపుణులు చెబుతున్నారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వివరణ ప్రకారం, మొబైల్ యాప్‌ల ద్వారా జరిగే చెల్లింపుల్లో ప్లాట్‌ఫారమ్‌లు గణనీయమైన కమిషన్ తీసుకుంటాయి. ముఖ్యంగా యాపిల్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వేర్వేరు శాతాల్లో ఫీజులు వసూలు చేస్తాయి.

దీంతో మొత్తం ఆదాయంలో సుమారు 55 శాతం మాత్రమే క్రియేటర్‌కు చేరుతుందని అంచనా. ఈ లెక్కన రూ.23 లక్షల గ్రాస్ ఆదాయం ఉంటే, చేతికి వచ్చే మొత్తం దాదాపు రూ.13 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. అదనంగా ఆ మొత్తంపై పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో బయటకు కనిపించే ఆదాయం అంతా లాభం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఉదాహరణ మార్కెటింగ్ కోణంలో కీలకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదం కారణంగా వచ్చిన అటెన్షన్, సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ వల్లే సబ్‌స్క్రైబర్ బేస్ పెరిగిందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, డిజిటల్ ప్రపంచంలో “అటెన్షన్ అంటే డబ్బే” అన్న భావన మరోసారి రుజువైందని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.