Butter chicken golgappa | బటర్ చికెన్ గోల్‌గప్ప.. ఈ వెరైటీ ఫుడ్ గురించి తెలిస్తే తప్పక టేస్ట్ చేస్తారు..!
Butter chicken golgappa : మీరు ఇప్పటికే చాకొలేట్ గోల్‌గప్ప, మీఠా గోల్‌గప్ప, ఆఖరికి ఫైర్ గోల్‌గప్పను కూడా ట్రై చేసి ఉండవచ్చు. కానీ ఈ బటర్ చికెన్ గోల్‌గప్ప వాటికంటే కూడా భిన్నమైన చాట్. డెల్వినా అనే ఎక్స్ యూజర్ ఈ సరికొత్త చాట్‌ను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

Butter chicken golgappa : రకరకాల ఆహార పదార్థాల కలయికతో వంటలు వండి ప్రయోగాలు చేయాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి. కానీ ఏండ్ల కొద్దీ ప్రపంచంలో వలసలు పెరిగిపోతున్నాయి. ఒక ప్రాంతం ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడుతున్నారు. దాంతో మిశ్రిత సంస్కృతి సంప్రదాయాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా వంటల్లో కూడా మిశ్రిత వంటకాలు పుట్టుకొస్తున్నాయి. కొత్తకొత్త వంట విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇప్పుడు బటర్ చికెన్ గోల్‌గప్ప అనే కొత్త రకం చాట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పంజాబీ గ్రేవీ చికెన్ కర్రీ, పానీపూరీల మిశ్రమమే ఈ బటర్ చికెన్ గోల్‌గప్ప. మీరు ఇప్పటికే చాకొలేట్ గోల్‌గప్ప, మీఠా గోల్‌గప్ప, ఆఖరికి ఫైర్ గోల్‌గప్పను కూడా ట్రై చేసి ఉండవచ్చు. కానీ ఈ బటర్ చికెన్ గోల్‌గప్ప వాటికంటే కూడా భిన్నమైన చాట్. డెల్వినా అనే ఎక్స్ యూజర్ ఈ సరికొత్త చాట్‌ను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
పంజాబ్ ప్రజలు వండుకునే ఒక క్లాసిక్ చికెన్ కర్రీ.. వీధుల్లో లభించే ఒక పాపులర్ స్నాక్ మిశ్రమమే ఈ బటర్ చికెన్ గోల్‌గప్ప. గోల్‌గప్ప స్నాక్‌లో బఠానాకు బదులుగా బటర్ చికెన్ కూరితే అది బటర్ చికెన్ గోల్‌గప్ప అవుతుంది. అయితే డెల్వినా చేసిన ఈ పోస్టుకు నెటిజన్‌ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. ఈ మిశ్రమం వల్ల ఆ రెండు పదార్థాలకు విడివిడిగా ఉండే రుచి నాశనమైపోతందని కొందరు నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు.
జీవితంలో ఇలాంటి ప్రయోగాలు అస్సలే చేయకూడదని ఇంకొందరు నెటిజన్‌లు పేర్కొన్నారు. కానీ ఓ ట్విట్టర్ యూజర్ మాత్రం ఈ కాంబినేషన్‌ను ట్రై చేయవచ్చు అన్నారు. గోల్‌గప్పకు బటర్ చికెన్ కలుపడంవల్ల టేస్ట్ బాగా ఉంటుండవచ్చని ఓ నెటిజన్ తన అంచనాను వెలిబుచ్చాడు. బటర్ చికెన్ కలిసింది ఏదైనా తాను ఇష్టంగా తింటానని, కొన్ని నెలల క్రితం బటర్ చికెన్ ఆమ్లెట్ కూడా తిన్నానని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మరి ఈ వెరైటీ చాట్‌ను మీరు కూడా టేస్ట్ చేయండి..?