SS Rajamouli | రాజమౌళి ‘మహాభారతం’ సినిమా చేస్తే.. ఆ పాత్రలలో ఈ హీరోలేనా?
SS Rajamouli | రాజమౌళి సినిమా అంటే అది అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఇక ఆ సినిమా ఎన్నేళ్ళు సాగుతుందో కూడా చెప్పలేం. తన సినిమాల్లో భారీకాయంతో ఉన్న వారినే విలన్లుగా, హీరోలుగా తీసుకుంటాడు రాజమౌళి. ఈ దర్శకుడి సినిమాలో చేయాలని తపించే హీరోల లెక్క కూడా ఎక్కువే.. త్వరలో మహేష్‌తో రాజమౌళి సినిమా త్వరలో ఉండబోతుంది. దీనికి మహేష్ బాడీ మరింత ఫిట్‌గా ఉండాలని మూడు నెలలు వర్క్ షాప్‌లో ట్రైనింగ్ తీసుకోవాలన్నాడట. దీనికి […]

SS Rajamouli |
రాజమౌళి సినిమా అంటే అది అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఇక ఆ సినిమా ఎన్నేళ్ళు సాగుతుందో కూడా చెప్పలేం. తన సినిమాల్లో భారీకాయంతో ఉన్న వారినే విలన్లుగా, హీరోలుగా తీసుకుంటాడు రాజమౌళి. ఈ దర్శకుడి సినిమాలో చేయాలని తపించే హీరోల లెక్క కూడా ఎక్కువే.. త్వరలో మహేష్‌తో రాజమౌళి సినిమా త్వరలో ఉండబోతుంది. దీనికి మహేష్ బాడీ మరింత ఫిట్‌గా ఉండాలని మూడు నెలలు వర్క్ షాప్‌లో ట్రైనింగ్ తీసుకోవాలన్నాడట.
దీనికి సంబంధించి అప్పుడే కసరత్తులు మొదలు పెట్టాడు మహేష్. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎండకన్నెరగని, సుకుమారుడైన మహేష్ కండల వీరుడిగా తయార వ్వడానికి కష్టపడుతుంటే వీడియో చూసిన అభిమానులు సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అంటూ అంచనాలు కడుతున్నారు. ఇక ఈ ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారట.
అయితే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తే దాదాపు ఎనిమిది భాగాలుగా తీయాల్సి వస్తుందని అన్నారు. ఇదే మాట గతంలో రాజమౌళి కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విషయం మీద మాట్లాడుతూ బహుశా ఈ సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి సినిమాలకు గుడ్ బై చెప్పినా చెప్పొచ్చనే డౌట్ క్రియేట్ చేసి వదిలాడు విజయేంద్రప్రసాద్.
ఇదే సినిమా గురించి ఇంకో వార్త కూడా తిరుగుతుంది. మహాభారతం సినిమా తెరకెక్కితే అందులో నటించే నటీనటులు వీళ్ళే అయి ఉంటారని, ఆ తారలు చేయబోయే పాత్రలను కూడా ఊహించి నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ వాళ్ళెవరంటే శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్, ధర్మరాజుగా పవన్ కళ్యాణ్, దుర్యోధనుడిగా రానా, భీష్ముడిగా రజనీకాంత్, ద్రోణాచార్యుడిగా అమితాబ్ బచ్చన్, ద్రౌపదిగా దీపికా పదుకొనె నటించే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు జరుగుతున్నాయి.
అయితే ఈ మూవీ గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా రాజమౌళి ఇవ్వలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టనున్నారని మాత్రం టాక్ నడుస్తుంది. చూడాలి రాజమౌళి ఏం మాయ చేయనున్నాడో మరి.