Diabetes Control | మధుమేహాన్ని తగ్గించుకునేందుకు వంటింటి చిట్కాలు..!

Diabetes | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బాధితులు పెరుగుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కోట్లాది మంది షుగర్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఒకసారి దీని బారినపడితే జీవితాంతం భరించాల్సిందేనన్నది చేదైన కఠిన వాస్తవం. అయితే, ఈ చేదు వాస్తవం చాటున చక్కని పరిష్కారాలు సైతం లేకపోలేదు. పూర్తిగా నివారించపోయినా కొన్ని ఆయుర్వేద పద్ధతులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మన ఇంట్లో అందుబాటులో ఉండే మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. […]

Diabetes Control | మధుమేహాన్ని తగ్గించుకునేందుకు వంటింటి చిట్కాలు..!

Diabetes | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బాధితులు పెరుగుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కోట్లాది మంది షుగర్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఒకసారి దీని బారినపడితే జీవితాంతం భరించాల్సిందేనన్నది చేదైన కఠిన వాస్తవం. అయితే, ఈ చేదు వాస్తవం చాటున చక్కని పరిష్కారాలు సైతం లేకపోలేదు. పూర్తిగా నివారించపోయినా కొన్ని ఆయుర్వేద పద్ధతులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మన ఇంట్లో అందుబాటులో ఉండే మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఆ మసాలా దినుసులేంటో ఓసారి తెలుసుకుందాం రండి..!

ఇవి ట్రై చేసి చూడండి..

  • షుగర్ అదుపులో ఉండాలంటే నల్ల మిరియాల పొడిని భోజనానికి కొద్దిసేపటి ముందు తీసుకోవాలి.
  • లవంగాలలో ఉండే గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఆహారం తిన్న తర్వాత షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అందుకే భోజనం తర్వాత ఒకటి రెండు లవంగాలు తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉంటుంది.
  • ధనియాలు రక్తంలో షుగర్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే ఉడకబెట్టి తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉంటుంది.
  • దాల్చిన చెక్కలో ఉండే గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. దాల్చిన చెక్క పొడిని లేదా దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి తీసుకుంటే షుగ‌ అదుపులో ఉంటుంది. దాల్చిన చెక్క పొడిని పాలలో కలిపి తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
  • మెంతుల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. యాంటీ డయాబెటిక్‌ లక్షణాలుంటాయి. కార్బోహైడ్రేట్లను గ్రహించడంలో సహాయపడుతాయి. నాబెట్టిన మెంతులు తీసుకుంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.
  • పసుపులో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. కుర్కుమిన్ పసుపులో ఉంటుంది. షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలలో పసుపు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.