ప్యాంక్రియాటిక్ కేన్సర్ ను నివారించే కొత్త ప్రోటీన్
కొత్త ఎస్ పిపి 1 ప్రోటీన్ పరిశోధన ద్వారా ప్యాంక్రియాటిక్ కేన్సర్ కణాల వృద్ధి & ట్యూమర్ వ్యాప్తి నివారించవచ్చు

ప్యాంక్రియాటిక్ కేన్సర్ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ రకాలలో ఒకటి. దీని చికిత్సకు సంబంధించి శాస్త్రవేత్తలు ఇటీవల ఒక కీలకమైన పరిశోధనను చేపట్టారు. లండన్‌లోని ఇని స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్ లోని శాస్త్రవేత్తలు, ఎస్ పిపి 1 అనే ప్రోటీన్‌ను గుర్తించారు, ఇది పాంక్రియాటిక్ డక్టల్ అడినోకార్సినోమా అనే క్యాన్సర్ రకానికి కారణమయ్యే కీలకమైన అంశంగా ఉంది.
ఎస్ పిపి 1 ప్రోటీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రేరేపించడంలో కీలకమైంది. ఈ ప్రోటీన్‌ను అడ్డుకుంటే, క్యాన్సర్ కణాల వృద్ధి గణనీయంగా తగ్గిపోయి, ట్యూమర్ వ్యాప్తిని నివారించొచ్చు.
ల్యాబ్‌లో నిర్వహించిన మినీ ట్యూమర్‌లు, ఎలుకల మోడల్స్ లో ఎస్ పిపి1 ప్రోటీన్ ను అడ్డుకుంటే, క్యాన్సర్ వృద్ధి గణనీయంగా తగ్గింది. ట్యూమర్ వ్యాప్తి నివారించబడింది. ఈ పరిశోధనలు ఎస్ పిపి 1 ప్రోటీన్ ను లక్ష్యంగా చేసుకునే ఔషధాలు అభివృద్ధి చేయడానికి దారి సుగమం చేస్తున్నాయి. ఈ ఔషధాలను డెవలప్ చేయగలిగితే పాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు రావచ్చు. ఈ ఔషధాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడానికే కాకుండా ట్యూమర్ వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడతాయి.