Turmeric Drink | ఈ క‌షాయంతో అందం సొంతం..! బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా..!!

Turmeric Drink | ప్ర‌తి రోజు ప‌ర‌గ‌డుపున ప‌సుపు క‌షాయం( Turmeric Drink ) తాగ‌డం వ‌ల్ల అందం కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు( Health Benefits ) కూడా ఎన్నో పొందొచ్చు.

  • By: raj    health    Nov 21, 2024 10:00 AM IST
Turmeric Drink | ఈ క‌షాయంతో అందం సొంతం..! బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా..!!

Turmeric Drink | ప‌సుపు( Turmeric ).. ఈ ప‌దార్థం లేని ఇల్లు ఉండ‌దు.. ఇది లేకుండా ఏ గృహిణి కూడా వంట‌లు చేయ‌లేరు. ఎందుకంటే ప‌సుపుకు అంత ప్రాధాన్య‌త ఉంటుంది. ఆయుర్వేదం( Ayurvedam )లో ప‌సుపును విరివిగా ఉప‌యోగిస్తారు. అంతేకాకుండా అనారోగ్యాల‌కు గురైన వారికి ప‌సుపు చ‌క్క‌టి ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. ప్ర‌తి రోజు ప‌ర‌గ‌డుపున ప‌సుపు క‌షాయం( Turmeric Drink ) తాగ‌డం వ‌ల్ల అందం కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు( Health Benefits ) కూడా ఎన్నో పొందొచ్చు. పైగా దీనిని తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదట. చాలా సింపుల్​గా ఇంట్లో దీనిని చేసుకోవచ్చు. మరి ఈ కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎలా ప్రిపేర్ చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శారీరక ప్రయోజనాలు..

పసుపులో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, శరీరంలో మంట, వాపును దూరం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా.. ఫ్లూ ఇన్​ఫెక్షన్లను దగ్గరకు రాకుండా చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. లివర్, కిడ్నీ సమస్యలను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అందంతో పాటు హెల్తీ హెయిర్ మీ సొంతం..

ఈ డ్రింక్​ని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే.. చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది స్కిన్​కి మంచి గ్లోని ఇస్తుంది. పింపుల్స్​ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది.

షుగ‌ర్ పేషెంట్స్ తీసుకోవ‌చ్చా..?

ప‌సుపు క‌షాయాన్ని మధుమేహమున్నవారు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్​ను కంట్రోల్ చేసి.. అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఈ డ్రింక్ మధుమేహమున్నవారు కూడా హాయిగా తీసుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఈ డ్రింక్​ని మీరు తాగాలనుకుంటే.. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. అలాగే మొదటిసారి ఈ డ్రింక్ ప్రారంభించేప్పుడు పసుపును తక్కువ మోతాదులో శరీరానికి అలవాటు చేయాలి. అంటే మరీ 1 టీస్పూన్ కాకుండా పావు టీస్పూన్, అర టీస్పూన్ అలా పెంచుకోవాలి. టీస్పూన్​ పరిమితి చాలు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది.