ఆపరేషన్ ఆక్టోపస్ 3.0.. GHOST SIM నెట్‌వర్క్ గుట్టురట్టు

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. రూ.101 కోట్ల మోసాలకు సంబంధించి 66 మందిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ ద్వారా ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు. 13 రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో రూ.101.87 కోట్ల మోసాలకు కారణమైన 66 మందిని అరెస్ట్ చేసి, 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 44 గోస్ట్ సిమ్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. సీపీ వీ.సీ.సజ్జనార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ప్రజలు కొత్త సిమ్ తీసుకునే సమయంలో తెలియకుండానే మరో సిమ్ యాక్టివేట్ చేయడం, గ్రామాలలో, గిరిజన ప్రాంతాల్లో క్యాంపులు పెట్టి అమాయకుల ఆధార వివరాలు సేకరించడం ద్వారా ,
కస్టమర్ల బయోమెట్రిక్ దుర్వినియోగం చేయడం ద్వారా కొత్త సిమ్ లను తీసుకోవడం.. డిజిటల్ అరెస్ట్, సెక్స్‌టార్షన్ వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు 193కి ఇలాంటి మోసాలపై సకాలంలో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

మళ్లీ డీలిమిటేషన్..మహిళా రిజర్వేషన్ బిల్లు !
కీలక మలుపులో తమిళ రాజకీయం.. రేపోమాపో విస్తరణ.. అన్నాడీఎంకేకు చీలిక వర్గానికి నో ప్లేస్‌?

Latest News