భారతీయులకు 10లక్షల వీసాలు

భారతీయులకు 10లక్షల వీసాలు
  • ఇదే అత్యధిక రికార్డు


విధాత: ముందెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఇప్పటికే భారతీయులకు 10లక్షల వీసాలు మంజూరీ చేసినట్లుగా అమెరికా రాయబార కార్యాలయం పేర్కోంది. తన అధికార సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ అన్ని రకాల వీసాలు కలిపి 10లక్షల వీసాలు జారీ చేశామని తెలిపింది. దీంతో ఈ ఏడాది భారత్‌లో మేం పెట్టుకున్న మిలియన్ వీసాల లక్ష్యాన్ని దాటేశామని, ఇక్కడితో ఆగిపోమని, రాబోయే నెలల్లో మరింత మందికి వీసాలు జారీ చేస్తామని పేర్కోంది.


ఇదే అంశంపై భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అనందం వ్యక్తం చేశారు. అలాగే భారత్‌తో మా ద్వైపాక్షిక సంబంధం మరింత బలపడిందని, ప్రపంచంలోనే ఇది అత్యంత కీలమైన బంధమని అభివర్ణించారు. అమెరికా ప్రపంచ వ్యాప్తంగా జారీ చేసిన మొత్తం వీసాల్లో 10శాతం భారతీయులకే వచ్చాయి. విద్యార్ధి వీసాలలో 20శాతం, హెచ్‌, ఎల్ విభాగ ఉద్యోగ వీసాల్లో 65శాతం భారతీయులకే లభించడం విశేషం.