టిప్పుతో హృద‌యం దోచేశాడు

విధాత‌:హోటల్‌కు వెళ్తే అక్కడ పని చేసేవాళ్లకు టిప్పు ఎంత ఇస్తారు.. 10 రూపాయలు.. 20 రూపాయలు.. మ‌హా అయితే 1000 రూపాయలు కానీ అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌లో ఓ కస్టమర్ అస‌లు బిల్లు రూ.2,968 చేసి టిప్పు మాత్రం దాదాపు 12 లక్షల రూపాయలు (16వేల డాలర్లు) ఇచ్చాడు. కరోనా కారణంగా హోటల్‌ నష్టాల్లో కూరుకుపోయిందని గమనించిన ఆ కస్టమర్‌ టిప్పు రూపంలో తన ఉదారతను చాటుకున్నాడు. క్రెడిట్‌ కార్డుతో చెల్లించిన బిల్లును చూసి హోటల్‌ యజమాని… అత‌ను […]

టిప్పుతో హృద‌యం దోచేశాడు

విధాత‌:హోటల్‌కు వెళ్తే అక్కడ పని చేసేవాళ్లకు టిప్పు ఎంత ఇస్తారు.. 10 రూపాయలు.. 20 రూపాయలు.. మ‌హా అయితే 1000 రూపాయలు కానీ అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌లో ఓ కస్టమర్ అస‌లు బిల్లు రూ.2,968 చేసి టిప్పు మాత్రం దాదాపు 12 లక్షల రూపాయలు (16వేల డాలర్లు) ఇచ్చాడు. కరోనా కారణంగా హోటల్‌ నష్టాల్లో కూరుకుపోయిందని గమనించిన ఆ కస్టమర్‌ టిప్పు రూపంలో తన ఉదారతను చాటుకున్నాడు. క్రెడిట్‌ కార్డుతో చెల్లించిన బిల్లును చూసి హోటల్‌ యజమాని… అత‌ను పొరపాటున అంత డబ్బు ఇచ్చాడేమో అనుకుని కస్టమర్‌ను పిలిచి అడగ‌గా పొరపాటు కాదని ఆ కస్టమర్‌ చెప్పే సరికి ఆశ్చర్యపోయాడు.