లెక్క త‌ప్పిన లెక్క‌ల టీచ‌ర్.. బాలుడితో లైంగిక సంబంధంతో గ‌ర్భం దాల్చింది..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ లెక్క‌ల టీచ‌ర్ లెక్క త‌ప్పింది. త‌న వ‌ద్ద లెక్క‌లు నేర్చుకునేందుకు వ‌చ్చిన బాలుడిపై క‌న్నేసి లైంగిక సంబంధం పెట్టుకుంది

లెక్క త‌ప్పిన లెక్క‌ల టీచ‌ర్.. బాలుడితో లైంగిక సంబంధంతో గ‌ర్భం దాల్చింది..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ లెక్క‌ల టీచ‌ర్ లెక్క త‌ప్పింది. త‌న వ‌ద్ద లెక్క‌లు నేర్చుకునేందుకు వ‌చ్చిన బాలుడిపై క‌న్నేసి లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె జైలు పాలైంది. చివ‌ర‌కు బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చిన ఆమె మ‌ళ్లీ లెక్క త‌ప్పింది. మ‌రో బాలుడితో లైంగిక కార్య‌క‌లాపాలు కొన‌సాగించింది. ఇప్పుడు గ‌ర్భం దాల్చింది. స‌ద‌రు టీచ‌ర్ వ్య‌వ‌హారం యూకేలో సంచ‌ల‌నంగా మారింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ్రిట‌న్‌కు చెందిన రెబ‌క్కా జాయ్‌నెస్‌(30) వృత్తిరీత్యా గ‌ణితం టీచ‌ర్. అయితే ఓ బాలుడు లెక్క‌లు నేర్చుకునేందుకు టీచ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చేవాడు. ఇక లెక్క‌ల స్టైల్లోనే అత‌న్ని వ‌ల‌లో ప‌డేసింది. ఎలాగంటే.. 11 అంకెల ఫోన్ నంబ‌ర్లో ఒక్క‌టి త‌ప్ప మిగిలిన అంకెల‌ను ఆ బాలుడికి చెప్పింది. ఇక త‌న మొబైల్ నంబ‌ర్ క‌నుక్కోవాల‌ని బాలుడికి ఛాలెంజ్ వేసింది టీచ‌ర్ రెబ‌క్కా. మొత్తానికి ఫోన్ నంబ‌ర్ క‌నుక్కోవ‌డం.. ఆ త‌ర్వాత ఫోన్ల‌లో మాట్లాడుకోవ‌డం జ‌రిగిపోయాయి.

ఇరువురి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌డంతో.. వ‌య‌సులో త‌న కంటే చిన్న‌వాడైన బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లింది. 345 పౌండ్ల ఖ‌రీదైన గూచీ బెల్ట్ ఇప్పించింది. అక్క‌డ్నుంచి త‌న అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది. ఇద్ద‌రు క‌లిసి లైంగిక చ‌ర్య‌లో పాల్గొన్నారు. ఈ విష‌యాన్ని బాలుడు త‌న స్నేహితుల‌కు చెప్పాడు. మొత్తానికి టీచ‌ర్, బాలుడి లైంగిక సంబంధం పోలీసుల‌కు తెలిసింది. దీంతో టీచ‌ర్ రెబ‌క్కాను అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం జైలుకు త‌ర‌లించారు. ఇదంతా 2021 ఏడాదిలో జ‌రిగింది. కొన్ని నెల‌ల క్రితం ఆమె బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సీన్ క‌ట్ చేస్తే.. విచార‌ణ స‌మ‌యంలోనూ రెబ‌క్కా.. జాయ్‌నెస్ అనే మ‌రో బాలుడిపై క‌న్నేసింది. స్నాప్ చాట్‌లో ప‌రియ‌మైన అత‌డికి త‌న ఫొటోలు పంపి.. అత‌డిని ఆక‌ర్షించింది. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె.. జాయ్‌నెస్‌ను త‌న అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది. అత‌నితో లైంగిక సంబంధం కొన‌సాగించ‌డంతో ఆమె గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే జాయ్‌నెస్ తాను ఎలాంటి త‌ప్పు చేయలేద‌ని చెబుతున్నాడు. కానీ ఆ బాలుడికి 16 ఏండ్లు నిండాయ‌ని తెలిసి.. అత‌నితో సంబంధం పెట్టుకున్న‌ట్లు టీచ‌ర్ రెబ‌క్కా కోర్టుకు తెలిపారు. యూకేలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసు ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉంది.