Afghanistan : అఫ్ఘానిస్తాన్ పెను విషాదం.. 1100 మంది మృతి

అఫ్ఘానిస్తాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపం 1100 మందిని బలి తీసుకుంది. 3500 మందికి పైగా గాయాలు కాగా, భారత్ సహాయం అందించింది.

Afghanistan : అఫ్ఘానిస్తాన్ పెను విషాదం.. 1100 మంది మృతి

న్యూఢిల్లీ : అఫ్ఘానిస్తాన్(Afghanistan) లో నెలకొన్న భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం వల్ల.. ఇప్పటివరకూ 1100 మందికి పైగా మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని..మరో 3500 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. బాధితులకు 15 టన్నుల ఫుడ్ మెటీరియల్, 1000 కుటుంబాలకు సరిపడే టెంట్స్‌ను పంపినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం కూడా రిలీఫ్ మెటీరియల్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.

అఫ్గానిస్థాన్‌లో నంగర్‌హార్(Nangarhar), కునార్‌(Kunar) ప్రావిన్స్‌లలో భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.0 నమోందైంది. అయితే అఫ్ఘాన్ లోని ఇళ్ల నిర్మాణాలు..భూకంప వేగం..కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో భూకంప మృతుల సంఖ్య భారీగా పెరిగింది.