Bear | ఎలుగుబంటి దెబ్బ‌కు 12 విమానాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం.. అదేలాగో తెలుసా..?

Bear | విమానాలు( Flights ) ల్యాండ్ అవ్వాల‌న్నా.. టేకాఫ్ అవ్వాల‌న్నా.. ర‌న్‌వేపై చిన్న ప‌క్షి( Bird ) ఉండ‌కూడ‌దు. ఎందుకంటే విమానానికి ఆ ప‌క్షి ఢీకొంటే.. ప్ర‌మాదాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఓ ఎలుగుబంటే( Bear ) ర‌న్‌వే( Runway )పై ప్ర‌త్య‌క్ష‌మైతే పెను ప్ర‌మాద‌మే. అలా ఓ ఎలుగుబంటి ర‌న్‌వేపై ప‌రుగులు పెడుతూ అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

Bear | ఎలుగుబంటి దెబ్బ‌కు 12 విమానాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం.. అదేలాగో తెలుసా..?

Bear | విమానాలు( Flights ) ల్యాండ్ అవ్వాల‌న్నా.. టేకాఫ్ అవ్వాల‌న్నా.. ఆ ఎయిర్‌పోర్టు ఏటీసీ( ATC ) అనుమ‌తి ఇవ్వాల్సిందే. అనుమ‌తి లేనిదే విమానాలు ఎగ‌ర‌లేవు.. దిగ‌లేవు. కానీ ఓ ఎలుగుబంటి( Bear ) మాత్రం ఏటీసీకి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ర‌న్‌వే( Runway )పై ఎలుగుబంటి ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఎయిర్‌పోర్టు( Airport ) సిబ్బంది త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఎలాంటి ప్ర‌మాదాలు జ‌రగ‌కుండా.. ర‌న్‌వేను మూసివేసి.. 12 విమానాల‌ను నిలిపివేశారు. ఈ ఘ‌ట‌న జ‌పాన్‌( Japan )లోని య‌మ‌గ‌టా ఎయిర్‌పోర్టు(Yamagata Airport )లో వెలుగు చూసింది.

య‌మ‌గ‌టా ఎయిర్‌పోర్టులో కొన్ని విమానాలు టేకాఫ్‌కు, ల్యాండింగ్‌కు రెడీగా ఉన్నాయి. అంత‌లోనే ఓ ర‌న్‌వేపై ఎలుగుబంటి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎలుగుబంటిని గ‌మ‌నించిన ఓ ఉద్యోగి.. ఉన్న‌తాధికారుల‌ను, ఏటీసీని అప్ర‌మ‌త్తం చేశాడు. ఇక 12 విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేసి, ఆ ర‌న్‌వేను మూసేశారు. నాలుగు ఫీట్ల పొడ‌వున్న ఎలుగుబంటిని ర‌న్‌వేపై నుంచి త‌ప్పించేందుకు సిబ్బంది చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు అట‌వీశాఖ అధికారులు వ‌చ్చి ఎలుగుబంటిని ప‌ట్టుకున్నారు. అనంత‌రం విమానాల రాక‌పోక‌ల‌ను ఏటీసీ అధికారులు క్లియ‌ర్ చేశారు.

ఇక జ‌పాన్‌లో ఎలుగుబంట్లు విచ్చ‌ల‌విడిగా సంచ‌రిస్తూ మానవ కార్య‌క‌లాపాల‌కు అనేక ఆటంకాలు సృష్టించిన‌ట్లు అధికారులు తెలిపారు. 12 నెల‌ల కాలంలోనే 219 దాడులు చేశాయ‌ని, ఆరుగురు మ‌ర‌ణాల‌కు ఎలుగుబంట్లు కార‌ణ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కాలంలో ఓ గోల్ఫ్ కోర్టులోకి ఎలుగుబంటి ఆక‌స్మికంగా ప్ర‌వేశించ‌డంతో.. ఆ టోర్న‌మెంట్‌ను ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింది.