Donald Trump|అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం.. కలిసి పని చేద్దామన్న మోదీ
Donald Trump|అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపు ఎవరిదా అంటూ అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, ఎట్టకేలకి ట్రంప్ మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాడు.. విజయం ఖాయమైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు నన్ను యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. ఎవరూ ఊహించలేని విధంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నా జీవితంలో ఇలాంటి క్ష

Donald Trump|అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపు ఎవరిదా అంటూ అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, ఎట్టకేలకి ట్రంప్ మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాడు.. విజయం ఖాయమైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు నన్ను యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. ఎవరూ ఊహించలేని విధంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నా జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకువస్తాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని అన్నారు. నా గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతోందని ట్రంప్ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు.
538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికాలో అధ్యక్షుడి పీఠం అధిరోహించాలంటే 270 ఓట్లు సాధించాలి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్ దాటి 277 స్థానాల్లో లీడ్ కనబరుస్తోంది. దీంతొో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ క్రమంలో ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘‘చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ కు హృదయపూర్వక అభినందనలు. మీ మునుపటి పదవీకాలం యొక్క విజయాలను మీరు నిర్మించేటప్పుడు, భారత్-యూఎస్ సమగ్ర గ్లోబల్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురు చూస్తున్నాను’’ అని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ ఇంటికే పరిమితం కాకుండా పట్టుదలతో ఎన్నికల ప్రచారం చేశారు. తుపాకీ గుళ్లకు భయపడకుండా ప్రచారం చేసి చివరికి విజయం సాధించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. 78 సంవత్సరాల వయసులోనూ ట్రంప్ అకుంఠిత దీక్ష, పట్టుదల, విజయం కోసం చేసిన పోరాటం అనన్య సామాన్యం అనే చెప్పాలి. కమలా హ్యారిస్ వంటి బలమైన ప్రత్యర్థితో భీకరంగా పోరాడి రెండో సారి వైట్ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారు ట్రంప్.