40 మంది చిన్నారుల ఊచ‌కోత‌.. తలలు న‌రికి వేసిన హమాస్ మిలిటెంట్లు

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌నలు వెలుగులోకి వ‌స్తున్నాయి. హ‌మాస్‌లోని క‌ఫర్ అజా కిబ్బ‌ట్జ్ ప్రాంతంలో సుమారు 40 మంది చిన్నారులు మ‌ర‌ణించారు

40 మంది చిన్నారుల ఊచ‌కోత‌..  తలలు న‌రికి వేసిన హమాస్ మిలిటెంట్లు

విధాత‌: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌నలు వెలుగులోకి వ‌స్తున్నాయి. హ‌మాస్‌లోని క‌ఫర్ అజా కిబ్బ‌ట్జ్ ప్రాంతంలో సుమారు 40 మంది చిన్నారులు మ‌ర‌ణించారు. వారిలో కొంద‌రి త‌ల‌లు న‌రికివేయ‌బ‌డ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) దక్షిణ హ‌మాస్‌లోని క‌ఫర్ అజా కిబ్బ‌ట్జ్ ప్రాంతంలో కనుగొన్నారు. హమాస్ మిలిటెంట్లు ఈ నెల ఏడో తేదీన‌ ఆకస్మిక దాడిలో చిన్నారులు మ‌ర‌ణించిన‌ట్టు ఇజ్రాయెట్ అధికారులు పేర్కొన్నారు. త‌ల్లిదండ్రుల‌తోపాటు నిద్రిస్తున్న‌చిన్నారుల‌ను కూడా హమాస్ మిలిటెంట్లు చంపేశార‌ని వెల్ల‌డించారు.

ఇజ్రాయెల్ నివాసితులు, హమాస్ మిలిటెంట్ల మృతదేహాల‌ను తీసుకెళ్లడానికి ఐడీఎఫ్‌ అధికారులు ఆ ప్రాంతాన్నిమంగ‌ళ‌వారం ప‌రిశీలించగా చిన్నారుల ఊచ‌కోత ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఇజ్రాయెల్ నివాసితులు, హమాస్ మిలిటెంట్ల మృతదేహాల‌ను కాలిపోయిన ఇడ్లు, కాల్చిన కార్ల నుంచి ఐడీఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.