తులం మట్టి విలువ.. రూ. 729.38 కోట్లు
విధాత:వాషింగ్టన్, జూన్ 8: ‘‘ఏముంది.. అంతా మట్టే కదా?’’.. చాలా మంది వైరాగ్యంతో అనే ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం..! అయితే.. అక్కడి మట్టి విలువ మాత్రం రూ. కోట్లలో ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఒక తులం మట్టి విలువ సుమారు రూ. 729.38 కోట్లుగా అంచనా. అంటే.. మేలిమి బంగారం కంటే సుమారు 1.44 లక్షల రెట్లు ఎక్కువ అన్నమాట..! ఇంతకీ ఆ మట్టి ఎక్కడుందనేదే మీ ప్రశ్న కదా? భూమికి దూరంగా.. అంగారక […]

విధాత:వాషింగ్టన్, జూన్ 8: ‘‘ఏముంది.. అంతా మట్టే కదా?’’.. చాలా మంది వైరాగ్యంతో అనే ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం..! అయితే.. అక్కడి మట్టి విలువ మాత్రం రూ. కోట్లలో ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఒక తులం మట్టి విలువ సుమారు రూ. 729.38 కోట్లుగా అంచనా. అంటే.. మేలిమి బంగారం కంటే సుమారు 1.44 లక్షల రెట్లు ఎక్కువ అన్నమాట..! ఇంతకీ ఆ మట్టి ఎక్కడుందనేదే మీ ప్రశ్న కదా? భూమికి దూరంగా.. అంగారక గ్రహంపైన..!
అంగారకుడిపై జీవరాసుల జాడను కనుగొనేందుకు నాసా ‘పర్సెవరెన్స్ రోవర్’ను పంపిన విషయం తెలిసిందే. అది ఈ ఏడాది ఫిబ్రవరిలో అరుణగ్రహంపైన.. 49 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన జెజీరో బిలం సమీపంలో దిగింది. ఒకప్పుడు ఆ నది ప్రవహించిన ఆ బిలం పరిసరాల్లోని మట్టిని సేకరించి, జీవరాసుల జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు దశల్లో అక్కడి నుంచి రెండు పౌండ్ల (907 గ్రాములు) మట్టి నమూనాలను భూమికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మట్టి భూమిని చేరడానికి దశాబ్ద కాలం పట్టవచ్చని చెబుతోంది. రెండు పౌండ్ల మట్టిని తీసుకువచ్చేందుకు రూ. 65,643.84 కోట్లు(900 కోట్ల అమెరికా డాలర్లు) ఖర్చు అవుతుంది. అంటే.. ఒక తులం (పది గ్రాములు) మట్టి ధర సుమారు రూ. 729.38 కోట్లన్నమాట..!