Massive Sinkhole On Bangkok’s Samsen Road | బ్యాంకాక్ లో రోడ్డుపై భారీ గుంత..వైరల్ గా ఘటన
బ్యాంకాక్ రోడ్డు మీద అకస్మాత్తుగా భారీ గుంత, విద్యుత్ స్తంభాలు, వాహనాలు పడిపోవడంతో 3,500 మందిని తరలించారు.

విధాత : థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిత్యం రద్దీగా రోడ్డు మార్గంలో అకస్మాత్తుగా ఓ భారీ గుంత పడటం వైరల్ గా మారింది. రోడ్డులో వాహనాలు వెలుతున్న క్రమంలో భారీ శబ్ధంతో ఆకస్మాత్తుగా రోడ్డు నెర్రెలు భారీ భూమిలో భారీ గుంత ఏర్పడింది. పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ముందు భాగాన ఉన్న ఈ రోడ్డులో పెద్ద సింక్ హోల్ ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు, ఒక టో ట్రక్, ఒక కారు సింక్‌హోల్‌లో పడిపోయాయి. నివాస ప్రాంతంలోనే ఈ గుంత ఏర్పడంతో అక్కడ ఉన్న భవంతులు కూలీపోయే ప్రమాదం నెలకొంది. దీంతో అక్కడి రెండు హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, సమీప భవనాల నుంచి 3,500 మంది రోగులు, సిబ్బంది, నివాసితుల్ని ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఉదయం చిన్నగా కుండడం మొదలైన రోడ్డు నిమిషాల్లో పెద్దదిగా మారి కాసేపటికే మొత్తం హాలివుడ్ సినిమాల తరహాలో భారీ స్థాయిలో కుంగిపోయింది. దాదాపు 50 మీటర్ల (160 అడుగులు) లోతులో, 30 మీటర్ల వ్యాసార్థంతో ఏర్పడిన ఈ భారీ గుంత కారణంగా విద్యుత్ లైన్లను తెగిపోయి, వాటర్ పైపులు పగిలిపోయి నీరు బయటకు ప్రవహిస్తుంది. రోడ్డు కింద ఉన్న సొరంగంలోని వాటర్ పైప్ లైన్ ఇటీవలి భారీ వర్షం కారణంగా లీక్ కావడంతో ఆ ప్రాంతంలో భూగర్భంలో నీరు చేరి గుంత ఏర్పడేందుకు కారణమై ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని..ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.