సంగీత అభిమానులకు షాకింగ్..

విధాత: సంగీత అభిమానులకు ఒకే రోజు రెండు షాకింగ్ వార్తలు ఎదురయ్యాయి. దక్షిణ అమెరికా లోని బ్రెజిల్ కు చెందిన ప్రఖ్యాత గాయని మరీలియా విమాన ప్రమాదంలో దుర్మణం చెందగా, ఉత్త ర అమెరికాలోని యూఎస్ఏలో ఓ మ్యూజిక్ ఫెస్ట్ లో ఊపిరాడక 8 మంది చనిపోయారు. హ్యూస్టన్ సిటీలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ తోపులాట ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారని, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతోన్న వాళ్లలో 17 మంది […]

సంగీత అభిమానులకు షాకింగ్..

విధాత: సంగీత అభిమానులకు ఒకే రోజు రెండు షాకింగ్ వార్తలు ఎదురయ్యాయి. దక్షిణ అమెరికా లోని బ్రెజిల్ కు చెందిన ప్రఖ్యాత గాయని మరీలియా విమాన ప్రమాదంలో దుర్మణం చెందగా, ఉత్త ర అమెరికాలోని యూఎస్ఏలో ఓ మ్యూజిక్ ఫెస్ట్ లో ఊపిరాడక 8 మంది చనిపోయారు.

హ్యూస్టన్ సిటీలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ తోపులాట ఘటనలో మొత్తం 8 మంది చనిపోయారని, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతోన్న వాళ్లలో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.

అమెరికాకే చెందిన పాపులర్ గాయకుడు ట్రవిస్ స్కాట్(Travis Scott) ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్( Astro world Festival) పేరుతో ఏటేటా మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహిస్తుంటాడు. కరోనా కారణంగా రెండేండ్లు వాయిదా పడిన ఈ ఫెస్ట్ మళ్లీ ఈ నవంబర్ 5న మొదలైంది. తొలి రోజే తోపులాట కారణంగా 8మంది చనిపోవడంతో మ్యూజిక్ ఫెస్టివల్ రద్దయిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచా రం తెలియాల్సి ఉంది