ఇరాన్ పై దాడులకు ఐదు రోజుల బ్రేక్ : ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం ప్రకటించిన ట్రంప్. చర్చలు కొనసాగుతుండగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు.

ఇరాన్ పై దాడులకు ఐదు రోజుల బ్రేక్ : ట్రంప్ సంచలన ప్రకటన

విధాత : ఇరాన్ పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐదు రోజులపాటు దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ఇరాన్‌కు 48 గంటల సమయం ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ యుద్దానికి తాత్కాలికంగా విరామం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

మూడు వారాకులపైగా ఇరాన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ట్రంప్.. తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇరాన్‌తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపిన ట్రంప్‌ తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామన్నారు. సోమవారం ట్రుత్ సోషల్‌ పోస్ట్‌లో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపైన, ఇంధన మౌలిక సదుపాయాలపైన దాడులు నిలిపి వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందన్నారు.

ట్రంప్ ప్రకటనతో మూడు వారాలకు పైగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడే అవకాశముంది. ప్రకటనతో చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ ధర 13 శాతం తగ్గింది. 17 డాలర్లు తగ్గి 96 డాలర్లకు దిగివచ్చింది.

మా హెచ్చరికలతోనే ట్రంప్‌ దిగివచ్చారు: ఇరాన్‌

తమ హెచ్చరికలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దిగివచ్చారని ఇరాన్‌ పేర్కొంది. ట్రంప్‌ తమ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా మూసేస్తామని.. ఇజ్రాయెల్‌ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సమాచార, ప్రసార సాంకేతికతలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమ హెచ్చరికల ఫలితంగానే ట్రంప్ యుద్ద విరామం ప్రకటించి చర్చలు ప్రారంభించారని ఇరాన్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

హరీశ్ రావు వర్సెస్ మంత్రులు ! … బడ్జెట్ చర్చలో వాగ్వివాదాలు!!
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లుకు అనుమతించండి : స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి