Trump warning to Hamas | ఆయుధాలు వదలకుంటే హమాస్‌కు అంతమే : ట్రంప్ వార్నింగ్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేయకపోతే హమాస్ అంతం తప్పదని అన్నారు.
Trump warning to Hamas | ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధాన్ని ఆపబోతున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్.. మధ్య ఆసియా ప్రస్తుతం శాంతియుతంగా ఉందని చెప్పారు. హమాస్ ఆయుధాలను వదిలేయాలని లేకుంటే వారి అంతం తప్పదని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది సంఘర్షణలను పరిష్కరించానని మరోసారి చెప్పకొన్న ట్రంప్.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మరోటి కూడా పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇది సులభంగానే పరిష్కారమవుతుందని తొలుత భావించానని, కానీ.. చాలా కఠినంగా ఉందని అన్నారు. ఈ ఘర్షణలో గత నెలలోనే 29వేలకు పైగా చనిపోయారని, అందులో సైనికులే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
గ్రీన్‌లాండ్ అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్.. తాను గ్రీన్‌లాండ్‌ను కోరుకుంటున్నానని, అది కూడా హక్కులు, టైటిల్, యజామానం సహా అని చెప్పారు. అదే సమయంలో గ్రీన్‌లాండ్‌ను మిలిటరీ అవసరాలకు వినియోగించబోనని తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు మిలిటరీ బలాన్ని ఉపయోగించబోనని చెప్పారు. తన ఐరోపా భాగస్వాములను సైతం ట్రంప్ పదేపదే అపహాస్యం చేస్తూ మాట్లాడారు. అమెరికా విస్తరణవాదాన్ని నాటో అడ్డుకోజాలదని తేల్చి చెప్పారు. ‘నేను బలాన్ని ఉపయోగిస్తానని ప్రజలు అనుకుంటున్నారు. కానీ.. నేను బలాన్ని ఉపయోగించను. అసలు నేను బలప్రయోగం చేయాలనుకోవడం లేదు.. చేయనుకూడా..’ అని అన్నారు.
దావోస్ సమ్మిట్ రెండో రోజున అంతర్జాతీయ సంఘర్షణలను నివారించేందుకు ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అనే సంస్థను ట్రంప్.. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలు ఆయనకు మద్దతుగా వేదికపైకి వచ్చి, చార్టర్‌పై సంతకాలు చేశారు. ఈ సమావేశం అనంతరం కాల్పుల విరమణపై చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లదీమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.
Read Also |
Bangladesh T20 World Cup Withdrawal | భారత్ లో జరిగే టీ 20వరల్డ్ కప్ ఆడం : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
EPFO 3.0 Reforms | ప్రావిడెంట్ ఫండ్ సేవలు : EPFO 3.0తో ఇక ఎక్కడైనా, ఎప్పుడైనా..!
TVK Vijay | విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల సింబల్ ‘విజిల్’
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram