Greenland Annexation | గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే సమయం వచ్చిందన్న ట్రంప్ వ్యాఖ్యలపై నూక్‌లో చరిత్రలోనే అతిపెద్ద నిరసనలు చెలరేగాయి. ‘గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Greenland Annexation | గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసిందంటూ సంచలన పోస్టు పెట్టాడు. తన సోషల్ మీడియా ట్రూత్‌లో గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి సమయం ఆసన్నమైందని..ఇది జరిగి తీరుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గ్రీన్‌లాండ్‌కు రష్యా నుంచి ముప్పు పొంచి ఉంది. అని..ఈ ముప్పు తప్పించాలని 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు నాటో చెబుతూ వస్తోంది అని గుర్తు చేశారు. అయినా ఈ విషయంలో డెన్మార్క్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని ఆక్షేపించారు. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ సంరక్షణకు, స్వాధీనానికి సమయం ఆసన్నమైందని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా పోస్టు చేశారు.

ట్రంప్ తీరును నిరసిస్తూ గ్రీన్ ల్యాండ్ వాసులు భారీ నిరసన

అంతకుముందే గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రధాని జెన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సన్‌ సహా ప్రజలు భారీ నిరసనకు దిగారు. ఈ నిరసన ర్యాలీలో ‘గ్రీన్ లాండ్ అమ్మకానికి లేదు’ అంటూ నినాదాలతో జనం హోరెత్తించారు. తమ సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని గ్రీన్ లాండ్ వాసులు స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా గళమెత్తిన ఈయూ దేశాలపై ట్రంప్ టారిఫ్ లు విధించడాన్ని తప్పుబట్టారు. రాజధాని నూక్ లో గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసన నిర్వహించారు.

ఇవి కూడా చదవండి :

Indore Crorepati Beggar : మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
Silver Gold Price|వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు