చక్కనమ్మకు చిక్కిన విలువైన వజ్రం..జాక్ పాట్ పట్టేసింది
అమెరికాలోని అర్కన్సాస్ పార్క్లో మహిళకు 2 క్యారెట్ల తెల్లటి వజ్రం దొరికింది. దీని విలువ రూ.24 లక్షలు అని అంచనా.

విధాత : వజ్రాల అన్వేషణ చేస్తున్న అమెరికాలోని ఓ మహిళకు జాక్ పాట్ తగిలింది. మిలమిల మెరిసే 2క్యారెట్ల తెల్లటి వజ్రం ఆమెకు దొరికొంది. అమెరికాలో వజ్రాల వేటకు ప్రసిద్ధి చెందిన అర్కన్సాస్ స్టేట్ పార్క్లో 31ఏళ్ల మిషెర్ ఫాక్స్ అనే మహిళ వజ్రాల వేటలో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా..2 క్యారట్ల తెల్లటి వజ్రం ఆమె కాలికి తగిలింది. దీని విలువ 27 వేల డాలర్లు (సుమారు రూ.24లక్షలు) ఉండొచ్చని అంచనా వేశారు.
37 ఎకరాల విస్తీర్ణంలోని ఆ పార్కులో రోజుకు 15 డాలర్లు చెల్లించి ఎవరైనా వజ్రాలు అన్వేషించుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఇక్కడ 350కి పైగా వజ్రాలు దొరకగా మిషెర్ ఫాక్స్ కు దొరికిన వజ్రజం మూడో అతి పెద్ద వజ్రం కావడం విశేషం. విలువైన వజ్రం దొరకడంతో తన అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. తన నిశ్చితార్థం కోసం ఆ వజ్రాన్ని పొదిగి ఓ ఉంగరం చేయించుకుంటానని మిషెర్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి…
స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ సతీమణి లెజినోవా సందడి
2024లో భారతీయుల నుండి ₹23,000 కోట్లు దోచుకున్న సైబర్ మోసగాళ్లు!