Son Buried Along With Bike| కొడుకుతో పాటు బైక్ సమాధి..కంటతడి పెట్టించే విషాద ఘటన

Heart breaking incident: రోడ్డు ప్రమాదం(Road Accident)లో మరణించిన(death) తమ కన్నకొడుకు(Son) మృతదేహం(Buried)తో పాటు అతనికి ఇష్టమైన బైక్(Bike)ని కూడా అతని తల్లిదండ్రులు సమాధి చేసిన ఘటన(Emotional Story) అక్కడి వారందరిని కంటతడి పెట్టించింది. సోషల్ మీడియా సైతం ఈ ఘటన పట్ల నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్(Gujarat)లోని ఆనంద్(Anand) జిల్లాకు చెందిన క్రిష్ పర్మార్(18) ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఇటీవలే ఓ డిగ్రీ కళాశాలలో చేరాడు. కాలేజీకి బైక్ మీద వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ ఢీకొని గాయపడిన క్రిష్ పర్మార్(Krish Parmar) 12రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు.
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు మరణాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు అంత్యక్రియల సందర్భంగా అతడికి ఇష్టమైన బైక్, బట్టలు, బూట్లు ఇతర వస్తువులను అతని మృతదేహంతో పాటే ఖననం చేశారు. ఈ దృశ్యం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రుల ఆవేదనను చూసి వారంతా కూడా కన్నీరుమున్నీరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిని ఈ ఘటనలో క్రిష్ తల్లిదండ్రుల ఆవేదనను అర్ధం చేసుకుని తమ సానుభూతిని తెలిపుతున్న నెటిజన్లు..పిల్లలకు బైక్ లు, కార్లు ఇవ్వడంపై ఆలోచించాలన్నారు.