Devara | ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ.. మా దేవ‌ర క‌థ‌.. జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న దేవ‌ర చిత్రం ట్రైల‌ర్ విడుద‌లైంది. ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ.. మా దేవ‌ర క‌థ‌.. అని ట్రైల‌ర్‌లో చెప్పారు. ఈ సినిమా 27న విడుద‌ల కానుంది.

Devara | ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ.. మా దేవ‌ర క‌థ‌.. జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

Devara | ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ( Koratala Shiva ) ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా తెర‌కెక్కుతున్న దేవ‌ర( Devara ) చిత్రం ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 27న ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. కులం లేదు, మ‌తం లేదు.. భ‌యం.. అస‌లే లేదు.. ధైర్య‌మే త‌ప్ప ఏమి తెలియ‌ని క‌ళ్ల‌ల్లో మొద‌టిసారి భ‌యం పొర‌లు క‌మ్ముకున్నాయి లాంటి డైలాగులు ట్రైల‌ర్‌లో ఉన్నాయి. ఈ డైలాగులు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో పూన‌కాలు తెప్పిస్తున్నాయి. మ‌నిషికి బ‌తికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు.. అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఆడికి వాళ్ల అయ్యా రూపం వ‌చ్చింది కానీ ర‌క్తం రాలేదే అనే జాన్వీ క‌పూర్( Janhvi Kapoor ) చెప్పిన డైలాగ్ ఆస‌క్తి రెకేత్తించేలా ఉంది.

దేవర సినిమా( Devara Movie )ను సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఫిమేల్ లీడ్ కాగా.. సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) విలన్ పాత్ర పోషించాడు. ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్లకు ఇదే తొలి తెలుగు సినిమా. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే వచ్చిన మూడు పాటలూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మూడేళ్ల కిందటే మూవీని అనౌన్స్ చేయగా.. సినిమా నిర్మాణం మెల్లగా సాగింది. గతేడాది సినిమా అధికారిక టైటిల్ అనౌన్స్ చేశారు.

మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో జూనియర్ ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం అతడు ఆదివారమే (సెప్టెంబర్ 8) ముంబైకి వెళ్లాడు. తన ఎడమ చేతికి తగిలిన గాయం నుంచి కూడా తారక్ పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు.