NTR| వార్‌2 సెట్స్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. న్యూ లుక్ అదిరిపోలా..!

  • Publish Date - April 12, 2024 / 06:26 AM IST

NTR| ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్ని కూడా భారీ బ‌డ్జెట్ చిత్రాలే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు. రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న మూవీ తొలి పార్ట్ ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. భారీ అంచ‌నాలు న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందా అని ప్రతి ఒక్క‌రు ఆస‌క్త‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మార‌గా, ఇప్పుడు వార్ 2 సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందుతుంది. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

కొన్ని రోజుల క్రింద‌ట మూవీ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. హృతిక్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా అడుగుపెట్టాడు. గురువారం తారక్‌ ముంబయికి చేరుకుని డైరెక్ట్‌గా వార్ 2 సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స్కై బ్లూ షర్ట్, జీన్స్ లో ఎన్టీఆర్‌. తలపై క్యాప్‌ ధరించి చాలా స్టైలిష్‌గా ద‌ర్శ‌నం ఇచ్చారు. ఎన్టీఆర్ బాలీవుడ్ గ‌డ్డ‌పై అడుగుపెట్ట‌డంతో అక్క‌డి మీడియా ఆయ‌న ఫొటోల కోసం తెగ ఎగ‌బ‌డ్డారు. చూస్తుంటే ఎన్టీఆర్ రానున్న రోజుల‌లో ముంబైని గ‌డ‌గ‌డ‌లాడించ‌నున్నాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక వార్ 2 విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ మ‌ధ్య ప‌ది రోజుల పాటు కీల‌క సన్నివేశాల‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తుంది.

చిత్రంలో హృతిక్‌ హీరోగా కనిపిస్తారని, నెగటివ్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారని ఓ టాక్ అయితే న‌డుస్తుంది. ఇక క‌థానాయిక‌గా కియారా అద్వాని న‌టిస్తుంది. తార‌క్ జోడిగా ఈమె న‌టిస్తుంద‌ని సమాచారం. కియారా ఇప్ప‌టికే తెలుగులో రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు వంటి టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో జ‌త క‌ట్ట‌బోతుంది. మూవీని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మ‌రో బాలీవుడ్ కూడా చేయ‌నున్నాడ‌ని టాక్. రానున్న రోజుల‌లో జూనియ‌ర్ ర‌చ్చ లేప‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు

Latest News