War2| ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో వార్ 2 ఒకటి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది. టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు. అయితే కొద్ది రోజులు క్రితం ఎన్టీఆర్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తు
War2| ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో వార్ 2 ఒకటి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది. టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు. అయితే కొద్ది రోజులు క్రితం ఎన్టీఆర్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న విషజ్ఞం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ కాంబో సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
అయితే వార్2లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఆ సమయంలో సెట్స్ నుంచి రెండు ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ఆ పిక్స్ లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. హృతిక్ బులెట్ జాకెట్ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటే.. ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ లుక్ దేవరకి భిన్నంగా ఉంది. ఇందులో చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. అయితే మూవీలో అతను రా ఏజెంట్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఉండేది కొంత సమయం అయితన ఈ పాత్ర చిత్రానికి చాలా కీలకం అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ తన పాత్రకి సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం కోసం 60 రోజుల డేట్స్ ని ఇచ్చినట్టు తెలుస్తుంది.
వార్ 2 మూవీతో ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసిన మేకర్స్ ఆ తర్వాత పాత్రతో స్పై సినిమాటిక్ యూనివర్స్‌లో మరో మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన చర్చలు పూర్తి కావడం, జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఇక ఈ మూవీ దేవర షూటింగ్ పూర్తయ్యాక పట్టాలెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ని 2024 ఆగష్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తుంటే జాన్ అబ్రహం విలన్ గా కనిపించి అలరించనున్నారు. కాగా, ఎన్టీఆర్ దేవర చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.