T Jeevan Reddy resignation| 25న కాంగ్రెస్ కు రాజీనామా : టి.జీవన్ రెడ్డి

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, జగిత్యాల కార్యకర్తలకు లేఖ రాశారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 22, 2026, 6:00 pm IST
Read Time: 2 mins
T Jeevan Reddy resignation| 25న కాంగ్రెస్ కు రాజీనామా : టి.జీవన్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, జగిత్యాల కార్యకర్తలకు లేఖ రాశారు. గత 20 నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల వల్ల తీవ్ర మానసిక క్షోభకు, అవమానాలకు గురవుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అవమానాలు భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు.

ఈ నెల 25న కార్యకర్తలతో సమావేశమై అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నారు. ‘నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, మార్గదర్శనం కావాలి’ అని కార్యకర్తలను కోరారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పొసగకపోవడం..పార్టీలో సినీయర్ గా ఉన్న తనను కాదని, సంజయ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జీర్ణించుకోలేని జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.