Uttarakhand Flash Floodsఅలకనందా ఆగ్రహం..పలువురు గల్లంతు!

Uttarakhand Flash Floodsఅలకనందా ఆగ్రహం..పలువురు గల్లంతు!

విధాతUttarakhand Flash Floods : ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్(Cloudburst)తో భారీ వర్షాలు..వరదలు బీభత్సం సృష్టించాయి. అలకనందా నది(Alaknanda River)  ఉగ్రరూపం దాల్చడంతో చమోలి(Chamoli )జిల్లాలో థరాలీ గ్రామంలో అర్థరాత్రి ఆకస్మిక వరద(Flash Flood)లు సంభవించాయి. అలకనందా ప్రవాహంలో పలువురు గల్లంతయ్యారని సమాచారం. సగ్వారా గ్రామంలో ఓ యువతి మృతి చెందింది. వరద ఉదృతి నివాస ప్రాంతాలను తాకడం..బురద నీటిలో వాహనాలు పెద్ద సంఖ్యలో కూరుకపోయాయి.

ఇళ్లలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఆకస్మిక వరదల పరిస్థితులపై సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికార యంత్రాంగంతో సమీక్షించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విద్యాసంస్థలు మూసివేశారు. రహదారులు, వంతెనలు దెబ్బతిని రాకపోకలు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలు స్తంభించాయి.