దూల్ పేటలో 160కిలోల నల్లమందు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

దూల్‌పేట నారాయణ గూడ ప్రాంతంలో 160 కిలోల నల్లమందును పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎక్సైజ్ సూపరిడెంట్ విజయ్‌ వివరాలు వెల్లడించారు

దూల్ పేటలో 160కిలోల నల్లమందు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

విధాత: దూల్‌పేట నారాయణ గూడ ప్రాంతంలో 160 కిలోల నల్లమందును పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎక్సైజ్ సూపరిడెంట్ విజయ్‌ వివరాలు వెల్లడించారు. 15 రోజులుగా నల్లమందు నగరానికి సరఫరా అవుతుందని మాకు సమాచారం అందిందని, రాజస్థాన్ నుంచి నల్లమందు హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు.

పట్టుబడిన నల్లమందును కిలో 10లక్షల విలువ చేసే ఓపీఎం(పాపిస్ట్రా)గాను, 5కిలోలకు పైగా హెరాయిన్‌గా మార్చవచ్చని, దాని విలువ 5 నుంచి 6కోట్ల వరకు ఉంటుందన్నారు. రాజస్థాన్ నుంచి బారామేర్ జిల్లా నుంచి నల్లమందును పరాస్ అనే వ్యక్తి నుంచి తరలించి హైదరాబాద్ పరిధిలోని ధూల్‌పేట, కొంపల్లి, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. నిందితులు పరాస్ కొడుకు దేవేంద్ర కస్విన్‌, రాజారామ్‌లను అరెస్టు చేశామని తెలిపారు.