Viral News | విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

Viral News | విమానం కుదుపులకు గురై ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఆదివారం హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది. హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫీనిక్స్‌ నుంచి హొనొలుకు బయలుదేరింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు బలమైన గాలుల కారణంగా విమానం కుదుపులకు గురైంది. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పది మంది సిబ్బందితో పాటు సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. […]

Viral News | విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

Viral News | విమానం కుదుపులకు గురై ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఆదివారం హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది. హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫీనిక్స్‌ నుంచి హొనొలుకు బయలుదేరింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు బలమైన గాలుల కారణంగా విమానం కుదుపులకు గురైంది. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు.

దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పది మంది సిబ్బందితో పాటు సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ల్యాండయ్యే సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా కుదుపులకు ప్రయాణికులు ఒక్కసారిగా పైకి ఎగిరి.. కింది కప్పును ఢీకొట్టి కిందపడ్డారు.

మరికొందరు అటూఇటూ ఊగిపోయి కిటికీలను, ముందున్న సీట్లను ఢీకొట్టుకున్నారు. అలాగే విమానం ఎత్తు అకస్మాత్తుగా రెండు సార్లు తగ్గిందని, అప్పుడు సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లు అనిపించిందని పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. తర్వాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌ రంగంలోకి దిగి గాయపడ్డ వారికి వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఎమర్జెన్సీ రూమ్స్‌కి తరలించారు. ఈ ఘటనపై హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఒకరు స్పందించారు. ఇలాంటి సంఘటన ఇటీవలకాలంలో ఎన్నడూ జరుగలేదన్నారు.