రష్యాలో విలీనం కానున్న ఉక్రెయిన్‌లోని 4 ప్రాంతాలు
విధాత: ఉక్రెయిన్‌లోని 4 ప్రాంతాలు రష్యాలో విలీనం కానున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. 4 ప్రాంతాల విలీన ప్రక్రియ వచ్చే వారం రష్యా పార్లమెంటు ఆమోదించనున్నది. విలీనంపై అధ్యక్షుడు పుతిన్ ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించనున్నది. ఉక్రెయిన్‌కు చెందిన 15 శాతం భూభాగం రష్యాలో కలవనున్నదని పుతిన్ అన్నారు. మా భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని, పుతిన్ ప్రకటన పనికి రానిదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరని […]

విధాత: ఉక్రెయిన్‌లోని 4 ప్రాంతాలు రష్యాలో విలీనం కానున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. 4 ప్రాంతాల విలీన ప్రక్రియ వచ్చే వారం రష్యా పార్లమెంటు ఆమోదించనున్నది. విలీనంపై అధ్యక్షుడు పుతిన్ ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించనున్నది.
ఉక్రెయిన్‌కు చెందిన 15 శాతం భూభాగం రష్యాలో కలవనున్నదని పుతిన్ అన్నారు. మా భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని, పుతిన్ ప్రకటన పనికి రానిదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరని అన్నారు.