America | బ‌ర్త్ డే వేడుక‌ల్లో కాల్పుల మోత‌.. న‌లుగురు మృతి

America | అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. అల‌బామా రాష్ట్రంలో నిర్వ‌హించిన ఓ బ‌ర్త్ డే పార్టీలు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. కాల్పుల‌కు న‌లుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ప‌లు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గుల […]

America | బ‌ర్త్ డే వేడుక‌ల్లో కాల్పుల మోత‌.. న‌లుగురు మృతి

America | అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. అల‌బామా రాష్ట్రంలో నిర్వ‌హించిన ఓ బ‌ర్త్ డే పార్టీలు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. కాల్పుల‌కు న‌లుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ప‌లు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అల‌బామాలోని డేడ్‌విల్లేలో ఉన్న ఓ డ్యాన్స్ స్టూడియోలో కొంద‌రు యువ‌తీ యువ‌కులు పుట్టిన రోజు వేడుక‌ల‌ను చేసుకుంటుండ‌గా ఈ ఘ‌ట‌న ఓటు చేసుకుంది. రాత్రి 10:30 గంట‌ల‌కు కాల్పుల మోత ప్రారంభ‌మైంది. కొంద‌రు యువ‌కులు వ‌చ్చి కాల్పులు జ‌రిపిన‌ట్లు క్ష‌త‌గాత్రులు పేర్కొన్నారు. ఎందుకు కాల్పులు జ‌రిపారు అనే విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేద‌ని అధికారులు తెలిపారు.