Mount Everest | ఎవరెస్ట్‌పై.. నేపాల్ హెలికాప్టర్ గల్లంతు
Mount Everest ఆరుగురు మిస్సింగ్.. ప్రతికూల వాతావరణమే కారణం విధాత: నేపాల్‌కు చెందిన ప్రైవేట్ కమర్షియల్ హెలికాప్టర్ మంగళవారం ఉదయం ఎవరెస్ట్ శిఖరంపై కనిపించకుండా పోయింది. పైలెట్‌తోపాటు ఆరుగురు గల్లంతు అయ్యారు. ఐదుగురు విదేశీ టూరిస్టులు మంగళవారం ఉదయం నేపాల్ రాజధాని కాట్మాండులో ప్రైవేటు చాపర్‌ను కిరాయికి మాట్లాడుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని సందర్శించేందుకు చాపర్‌లో బయలు దేరారు. శిఖరం ప్రదేశానికి హెలికాప్టర్ చేరుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. రాడార్‌తో చాపర్‌కు సిగ్నల్ కూడా […]

Mount Everest
- ఆరుగురు మిస్సింగ్.. ప్రతికూల వాతావరణమే కారణం
విధాత: నేపాల్‌కు చెందిన ప్రైవేట్ కమర్షియల్ హెలికాప్టర్ మంగళవారం ఉదయం ఎవరెస్ట్ శిఖరంపై కనిపించకుండా పోయింది. పైలెట్‌తోపాటు ఆరుగురు గల్లంతు అయ్యారు. ఐదుగురు విదేశీ టూరిస్టులు మంగళవారం ఉదయం నేపాల్ రాజధాని కాట్మాండులో ప్రైవేటు చాపర్‌ను కిరాయికి మాట్లాడుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని సందర్శించేందుకు చాపర్‌లో బయలు దేరారు. శిఖరం ప్రదేశానికి హెలికాప్టర్ చేరుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. రాడార్‌తో చాపర్‌కు సిగ్నల్ కూడా కట్ అయిందని ఏవియేషన్ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ప్రయాణ మార్గంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం చాపర్ గల్లంతుకు కారణం కావచ్చని ఎయిర్‌పోర్టు అధికారి సాగర్ కడేల్ తెలిపారు.