న్యూఇయ‌ర్ వేళ విషాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

నూత‌న సంవ‌త్స‌ర వేళ ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొన్న‌ది. కారు రోడ్డు మ‌ధ్య ఓ ఉన్న డివైడర్‌ను బ‌లంగా ఢీ కొనడంతో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు

న్యూఇయ‌ర్ వేళ విషాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
  • డివైడ‌ర్‌ను ఢీ కొట్టిన కారు.. ఇద్ద‌రికి గాయాలు
  • జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఘ‌ట‌న‌



విధాత‌: నూత‌న సంవ‌త్స‌ర వేళ ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొన్న‌ది. కారు రోడ్డు మ‌ధ్య ఓ ఉన్న డివైడర్‌ను బ‌లంగా ఢీ కొనడంతో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నగరంలో సోమవారం ఉదయం ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.


బిస్తుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్క్యూట్ హౌస్ స్క్వేర్ సమీపంలో తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌అధికారి తెలిపారు. వాహ‌నం వేగంగా న‌డ‌ప‌డం కార‌ణంగా అదుపుత‌ప్పి ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తున్న‌ది.


“ఎనిమిది మంది వ్యక్తులు ఐదు సీట్ల కారులో ప్రయాణిస్తున్నారు. ఇది మొదట రోడ్డు డివైడర్‌ను, తరువాత రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురిని ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు.


అక్కడ మరొక వ్యక్తి గాయాలతో మరణించాడు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు’ అని జంషెడ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కౌశల్ కిషోర్ మీడియాకు తెలిపారు. ప్ర‌మాదానికి గ‌ల కారణాలు తెలియాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.