జింక‌ను చంపిన ఏడుగురికి జ‌రిమానా

మచ్చల జింకలను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్న ఏడుగురికి ఒక్కొక్కరికి రూ. 50,000 జరిమానా విధించినట్టు డెంకనికోట్టై అటవీ శాఖ తెలిపింది

జింక‌ను చంపిన ఏడుగురికి జ‌రిమానా
  • త‌మిళ‌నాడులోని హోసూరు ఘ‌ట‌న‌


విధాత‌: మచ్చల జింకలను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్న ఏడుగురికి ఒక్కొక్కరికి రూ. 50,000 జరిమానా విధించినట్టు డెంకనికోట్టై అటవీ శాఖ తెలిపింది. నిందితులను చెల్లప్పన్ (65), రాంరాజ్ (31), రాజీవ్ (31), నాగరాజ్ (28), శివరాజ్‌కుమార్ (31), మరియప్పన్ (65), 18 ఏండ్ల బాలుడిగా గుర్తించిన‌ట్టు పేర్కొన్న‌ది.


హోసూరు సమీపంలోని జుజువాడి గ్రామంలోని పబ్లిక్ చెరువులో చుక్కల జింక కొంద‌రు వేటాడు. చంపి దాన్ని మాంసాన్ని ముక్క‌లుగా చేసి విక్ర‌యించారు. అయితే, కొంద‌రు జుజువాడి ప్రాంతంలో మ‌చ్చ‌ల జింక మ‌ర‌ణించిన‌ట్టు అటవీశాఖకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు జింకను కోసి మాంసాన్ని విక్ర‌యించిన‌ట్టు అటవీశాఖ విచారణలో వెలుగు చూసింది.


దీంతో అటవీశాఖ అధికారులు ఏడుగురిని పట్టుకుని ఒక్కొక్కరికి రూ.50 వేలు జరిమానా విధించారు. వన్యప్రాణులను వేటాడినా, వన్యప్రాణులకు సంబంధించిన వస్తువులను కలిగి ఉంటే వన్యప్రాణి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ వారందరినీ హెచ్చరించింది