Karnataka | రైలు ప్రమాదాన్ని నివారించిన 70 ఏండ్ల వృద్ధురాలు.. ఎలాగంటే..?
Karnataka | విధాత: ఓ 70 ఏండ్ల వృద్ధురాలు రైలు ప్రమాదాన్ని నివారించింది. ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రాణాలను కాపాడింది. రైలు పట్టాలకు (Railway Track) అడ్డంగా పడి ఉన్న వృక్షాన్ని గుర్తించిన వృద్ధురాలు.. చాకచక్యంగా వ్యవహరించింది. రైలు వస్తుందన్న విషయాన్ని గ్రహించి తన ఇంట్లో ఉన్న ఎరుపు బట్టను తీసుకొచ్చి.. దాన్ని ఊపుతూ పట్టాల పక్కకు నిల్చుంది. వృద్ధురాలిని గమనించిన లోకో పైలట్ (Loco Pilot) రైలును ఆకస్మాత్తుగా ఆపాడు. దీంతో […]

Karnataka |
విధాత: ఓ 70 ఏండ్ల వృద్ధురాలు రైలు ప్రమాదాన్ని నివారించింది. ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రాణాలను కాపాడింది. రైలు పట్టాలకు (Railway Track) అడ్డంగా పడి ఉన్న వృక్షాన్ని గుర్తించిన వృద్ధురాలు.. చాకచక్యంగా వ్యవహరించింది.
రైలు వస్తుందన్న విషయాన్ని గ్రహించి తన ఇంట్లో ఉన్న ఎరుపు బట్టను తీసుకొచ్చి.. దాన్ని ఊపుతూ పట్టాల పక్కకు నిల్చుంది. వృద్ధురాలిని గమనించిన లోకో పైలట్ (Loco Pilot) రైలును ఆకస్మాత్తుగా ఆపాడు. దీంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు(Mangaluru)కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు.. రైలు పట్టాలకు సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోంది. అయితే మార్చి 21వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఆ వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పట్టాల వైపు రాగా పడిల్ – జోక్కట్టే మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ భారీ వృక్షం విరిగి పడింది.
అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కూత ఆమె చెవిన పడింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడాలన్న ఉద్దేశంతో.. ఆమె తన ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది.
ఇంట్లో ఉన్న ఎరుపు బట్టను తీసుకొచ్చి చెట్టు పడి ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలో నిలబడి ఆ ఎరుపు బట్టను ఊపింది. వృద్ధురాలిని గమనించిన లోకో పైలట్ ఆకస్మాత్తుగా రైలును ఆపేశాడు. స్థానికులు, ప్రయాణికులు కలిసి ఆ చెట్టును పట్టాల పైనుంచి తొలగించారు. అనంతరం రైలు ముంబైకి బయల్దేరింది.
వృద్ధురాలికి సన్మానం
రైలు ప్రమాదాన్ని నివారించిన చంద్రావతి అనే వృద్ధురాలిని మంగళవారం రైల్వే అధికారులు, పోలీసులు కలిసి సన్మానించారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆమెకు ఇటీవలే హార్ట్ సర్జరీ కూడా జరిగింది. ఆమె అవేమీ పట్టించుకోకుండా.. రైలు కూత పెట్టడంతో.. హుటాహుటిన పట్టాల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి ఎరుపు బట్టను ఊపి రైలును ఆపింది.