భూనిర్వాసితుల న్యాయం కోసం 72గంటల దీక్ష: ఎంపీ కోమటిరెడ్డి

విధాత, నల్గొండ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌ మండలం బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268 లో భూమిని కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వకపోతే 72 గంటల నిరాహార దీక్షకు దిగుతానని మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం భూనిర్వాసితులకు మద్దతుగా బండరావిర్యాల చౌరస్తాలో రోడ్డు పై బైఠాయించి ఎంపీ వెంకట్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రైతు పోరాట సమితికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని […]

భూనిర్వాసితుల న్యాయం కోసం 72గంటల దీక్ష: ఎంపీ కోమటిరెడ్డి

విధాత, నల్గొండ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌ మండలం బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268 లో భూమిని కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వకపోతే 72 గంటల నిరాహార దీక్షకు దిగుతానని మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం భూనిర్వాసితులకు మద్దతుగా బండరావిర్యాల చౌరస్తాలో రోడ్డు పై బైఠాయించి ఎంపీ వెంకట్ రెడ్డి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రైతు పోరాట సమితికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేసినా ఇప్పటికి సమస్యలను పరిష్కరించలేదన్నారు. రైతులకు మద్దతుగా బండరావిరాల చౌరస్తాలో ఈ నెల 21వ తేదీన 72 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. శాంతియుతంగా నేను దీక్ష చేస్తానని, గతంలో కూడా తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశానని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకోసం మరోసారి దీక్ష చేస్తానన్నారు.

రైతులు పోరాటాన్ని మధ్యలో ఆపొద్దని, మీకు నేను అండగా ఉంటానన్నారు. 72 గంటల్లో సమస్యలు పరిష్కరించక పోతే అదే దీక్ష అమరణ నిరాహారదీక్షగా మారుతుందన్నారు. భువనగిరి ప్రాంతంలో నిర్వాసితులకు 32 లక్షల నష్టపరిహారం ఇస్తే ఇక్కడ మాత్రం 7లక్షల 40 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేదన్నారు. ప్రజలకు దూరంగా మైనింగ్ లను ఏర్పాటు చేయాలని, ఈ గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.