మహారాష్ట్రలో దారుణం.. యువ‌కుడిని కాల్చిచంపిన న‌క్స‌ల్స్‌

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ యువ‌కుడిని నక్సల్స్ కాల్చి చంపారు.

మహారాష్ట్రలో దారుణం.. యువ‌కుడిని కాల్చిచంపిన న‌క్స‌ల్స్‌
  • పోలీస్ఇ న్‌ఫార్మ‌ర్ అని ఆరోప‌ణ‌


విధాత‌: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ యువ‌కుడిని నక్సల్స్ కాల్చి చంపారు. అహేరి తహసీల్‌లోని కపెవంచ గ్రామానికి చెందిన రామ్‌జీ అత్రమ్ (27)ను శుక్రవారం రాత్రి సాయుధులైన న‌క్స‌ల్స్ కాల్చిచంపిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ వారం రోజుల వ్య‌వ‌ధిలో జిల్లాలో నక్సల్స్ చేసిన రెండవ హత్య ఇది ​​అని పేర్కొన్నారు.


అత్రం ఒక పోలీసు ఇన్‌ఫార్మర్ అని, అత‌డు అందించిన స‌మాచారం కారణంగా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా నక్సల్ చనిపోయిందని పేర్కొంటూ న‌క్స‌ల్స్ చేతిరాత‌తో రాసిన నోట్ ఘ‌ట‌నాస్థ‌లిలో వ‌దిలేశారు. అయితే, అత్ర‌మ్‌ ఇన్‌ఫార్మర్‌ కాదని పోలీసు అధికారి కొట్టిపారేశారు. ఈ ఎన్‌కౌంటర్ 14 నెలల క్రితం జరిగిందని ఆయన తెలిపారు.


కాగా, జిల్లాలోని ఎటపల్లి తహసీల్‌లోని టిటోలా గ్రామంలో నక్సల్స్‌ గురువారం రాత్రి ‘గ్రామ పాటిల్’ లాల్సు వెల్దా (63)ను కాల్చి చంపారు. మరికొంత మంది స్థానికుల‌ను కూడా న‌క్స‌ల్స్ కొట్టారు. నాటి ఘటనా స్థలంలో లభించిన ఒక కరపత్రంలో, నక్సల్స్ గడ్చిరోలి డివిజనల్ కమిటీ బాధ్యత వహించింది. గ్రామస్థుడు హెడారిలోని సుర్జాగఢ్ ఇనుప ఖనిజం గనుల ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్న‌ది.