ఒక తల, 8 కాళ్లతో వింత దూడకు జన్మనిచ్చిన గేదె
Buffalo | విధాత: అప్పుడప్పుడు ఆవులు, గేదెలు వింత దూడలకు జన్మనిస్తుంటాయి. తల ఒకటే ఉండి చేతులు, కాళ్లు ఎక్కువ ఉండటం. లేదంటే మనిషిని పోలిన ఆకారంలో దూడలు జన్మించడం చూశాం. తాజాగా ఓ గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఒక తల, రెండు శరీరాలు, 8 కాళ్లతో దూడ జన్మించింది. ఈ అరుదైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కొట్ర గ్రామానికి చెందిన ఉడుత మల్లేశ్ […]

Buffalo | విధాత: అప్పుడప్పుడు ఆవులు, గేదెలు వింత దూడలకు జన్మనిస్తుంటాయి. తల ఒకటే ఉండి చేతులు, కాళ్లు ఎక్కువ ఉండటం. లేదంటే మనిషిని పోలిన ఆకారంలో దూడలు జన్మించడం చూశాం. తాజాగా ఓ గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఒక తల, రెండు శరీరాలు, 8 కాళ్లతో దూడ జన్మించింది. ఈ అరుదైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొట్ర గ్రామానికి చెందిన ఉడుత మల్లేశ్ గేదెలను పెంచుకుంటున్నాడు. అయితే ఓ గేదెకు నెలలు నిండటంతో.. గురువారం అర్ధరాత్రి ప్రసవానికి ఇబ్బందులు పడింది. గమనించిన మల్లేశ్.. పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాడు. రాత్రి 2 గంటల సమయంలో పశు వైద్య సిబ్బంది.. కొట్ర గ్రామానికి చేరుకున్నారు.
బర్రెకు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. అయితే గేదె వింత దూడకు జన్మనిచ్చింది.ఒక తల, 8 కాళ్లు, రెండు శరీర భాగాలతో జన్మించింది. కానీ దూడ ప్రాణాలతో బతకలేదు. జన్యుపరమైన లోపాలతోనే ఇలాంటి దూడలు పుట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పిండ దశలో కవలల దూడలకు శరీర అవయవాలు సరిగ్గా విభజన జరగనప్పుడు శరీర భాగాలు ఇలా అత్తుకొని పుడుతుంటాయని చెప్పారు.