TSPSC: ఓఎంఆర్‌(OMR) షీట్‌ను మింగిన అభ్యర్థి

విధాత‌: టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ఈరోజు నిర్వహించిన డీఈవో(DEO) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే ఓ సెంటర్‌లో అభ్యర్థి ఓఎంఆర్(OMR) షీట్‌ మింగాడు. తన ఓఎంఆర్‌ షీట్‌లో వివారాలు తప్పుగా నింపాడు. దీంతో పరీక్ష హాజరు కాని అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ తీసుకుని పరీక్ష రాశాడు. తప్పుగా వివరాలు రాసిన తన సొంత ఓఎంఆర్‌ షీట్‌ను మింగాడు. పరీక్ష అనంతరం ఓఎంఆర్‌ పత్రాలు లెక్కించిన ఇన్విజిలేటర్‌ ఒకటి తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఒక ఓఎంఆర్‌ షీట్‌ లేకపోవడంతో సిబ్బంది సీసీ […]

TSPSC: ఓఎంఆర్‌(OMR) షీట్‌ను మింగిన అభ్యర్థి

విధాత‌: టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ఈరోజు నిర్వహించిన డీఈవో(DEO) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే ఓ సెంటర్‌లో అభ్యర్థి ఓఎంఆర్(OMR) షీట్‌ మింగాడు. తన ఓఎంఆర్‌ షీట్‌లో వివారాలు తప్పుగా నింపాడు. దీంతో పరీక్ష హాజరు కాని అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ తీసుకుని పరీక్ష రాశాడు. తప్పుగా వివరాలు రాసిన తన సొంత ఓఎంఆర్‌ షీట్‌ను మింగాడు.

పరీక్ష అనంతరం ఓఎంఆర్‌ పత్రాలు లెక్కించిన ఇన్విజిలేటర్‌ ఒకటి తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఒక ఓఎంఆర్‌ షీట్‌ లేకపోవడంతో సిబ్బంది సీసీ కెమెరా దృశ్యాలను చూసింది. ఓ అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ను మింగినట్లు గుర్తించింది. నిజామాబాద్‌ జిల్లా బోర్గాం జడ్పీ హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో ఈ ఘటన జరిగింది