London | న‌ర్సుతో శృంగారం చేస్తూ.. గుండెపోటుతో డ‌యాల‌సిస్ రోగి మృతి

London విధాత‌: డ‌యాల‌సిస్ కోసం నిత్యం ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగితో ఓ మ‌హిళా న‌ర్సుకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో న‌ర్సుతో శృంగారం చేస్తుండ‌గా, డ‌యాల‌సిస్ రోగి గుండెపోటుకు గురై చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న లండ‌న్‌లోని వేల్స్‌లో గ‌తేడాది చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వేల్స్‌కు చెందిన ఓ వ్య‌క్తి మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ ప‌డుతూ స్థానికంగా ఉన్న ఓ ఆస్ప‌త్రికి వెళ్లాడు. అయితే […]

  • By: Somu    latest    Jul 10, 2023 10:28 AM IST
London | న‌ర్సుతో శృంగారం చేస్తూ.. గుండెపోటుతో డ‌యాల‌సిస్ రోగి మృతి

London

విధాత‌: డ‌యాల‌సిస్ కోసం నిత్యం ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగితో ఓ మ‌హిళా న‌ర్సుకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో న‌ర్సుతో శృంగారం చేస్తుండ‌గా, డ‌యాల‌సిస్ రోగి గుండెపోటుకు గురై చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న లండ‌న్‌లోని వేల్స్‌లో గ‌తేడాది చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. వేల్స్‌కు చెందిన ఓ వ్య‌క్తి మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ ప‌డుతూ స్థానికంగా ఉన్న ఓ ఆస్ప‌త్రికి వెళ్లాడు. అయితే అదే హాస్పిట‌ల్‌లో ప‌ని చేస్తున్న న‌ర్సు పెనిలోప్ విలియ‌మ్స్(42) ఆ రోగికి ద‌గ్గ‌రైంది. దీంతో ఏడాదిన్న‌ర కాలం పాటు ఇద్ద‌రూ శారీర‌కంగా ద‌గ్గ‌య్యారు.

గ‌తేడాది జ‌న‌వ‌రిలో హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన‌ట్లు విలియ‌మ్స్‌కు రోగి ఫేస్‌బుక్ ద్వారా స‌మాచారం అందించాడు. దీంతో ఇద్ద‌రూ క‌లిసి హాస్పిట‌ల్ పార్కింగ్‌లో ఉన్న కారులోకి వెళ్లారు. వెనుక సీట్లో ఇద్ద‌రూ రొమాన్స్‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక శృంగారం చేస్తుండ‌గా డ‌యాలసిస్ రోగి గుండెపోటుతో కుప్ప‌కూలాడు.

అయితే విలియ‌మ్స్ అంబులెన్స్‌కు స‌మాచారం అందించ‌లేదు. త‌న ఫ్రెండ్స్‌కు చెప్ప‌డంతో ఆ కారు వ‌ద్ద‌కు చేరుకున్నారు. అంబులెన్స్‌కు ఫోన్ చేయాల‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఆమె వినిపించుకోలేదు. మొత్తానికి మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ టీమ్ కారు వ‌ద్ద‌కు వ‌చ్చి చూడ‌గా, రోగి అర్ధ న‌గ్నంగా ఉన్నాడు. పాయింట్ పూర్తిగా విప్ప‌బ‌డి ఉంది. శృంగారం చేస్తున్న క్ర‌మంలోనే గుండెపోటుకు గురై చ‌నిపోయిన‌ట్లు ఎమ‌ర్జెన్సీ టీమ్ నిర్ధారించింది.

ఈ ఘ‌ట‌న‌పై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టింది. రోగితో న‌ర్సు శారీర‌క సంబంధాలు పెట్టుకుంద‌న్న విష‌యం నిర్ధార‌ణ కావ‌డంతో.. ఈ ఏడాది మే నెల‌లో విలియ‌మ్స్‌ను విధుల నుంచి తొల‌గించారు. విలియ‌మ్స్‌ను న‌ర్సుగా కొన‌సాగిస్తే ఈ వ్య‌వ‌స్థ‌పై రోగులు న‌మ్మ‌కం కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం పేర్కొంది.