Road Accident | హర్యానాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృత్యువాత
Road Accident హర్యానాలోని జింద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీబీపూర్ వద్ద భివాని రోడ్డుపై బస్సు, క్రూయిజర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో […]

Road Accident
హర్యానాలోని జింద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీబీపూర్ వద్ద భివాని రోడ్డుపై బస్సు, క్రూయిజర్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదంలో క్రూయిజర్ నుజ్జునుజ్జు అయింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు