Scorpion
విధాత: విమానం గాల్లో ఉండగా ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. నాగ్ పూర్ నుంచి ముంబై వెళ్తున్న విమానoలో ఓ మహిళను తేలు కుట్టింది.
అప్రమత్తమైన విమాన సిబ్బంది ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వైద్యుడిని అందుబాటులో ఉంచిన ఎయిర్ పోర్ట్ అధికారులు .. విమానం ల్యాండ్ అవ్వగానే బాధితురాలికి చికిత్స అందించారు.
గత నెల 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. గతంలో పాములు, పక్షులు సైతం విమానాల్లో బయట పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రయాణికులు వాటి బారిన పడటం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి.